BigTV English

Venu thottempudi: డైరెక్టర్, హీరోని నమ్మి కోట్లు నష్టపోయిన టాలీవుడ్ హీరో..!

Venu thottempudi: డైరెక్టర్, హీరోని నమ్మి కోట్లు నష్టపోయిన టాలీవుడ్ హీరో..!

Venu thottempudi.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కామెడీ జానర్ లో రాజేంద్రప్రసాద్ తర్వాత అంతటి ఇమేజ్ సొంతం చేసుకున్న హీరోలలో వేణు తొట్టెంపూడి (Venu thottempudi)కూడా ఒకరు. స్వయంవరం చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమై, మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుని, ఆ తర్వాత హనుమాన్ జంక్షన్, చిరునవ్వుతో, పెళ్ళాం ఊరెళితే, కళ్యాణ రాముడు , చెప్పవే చిరుగాలి, శ్రీకృష్ణ 2006, యమగోల మళ్ళీ మొదలైంది, గోపి గోపిక గోదావరి , ఖుషి గా వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. చివరిగా ఎన్టీఆర్ హీరోగా నటించిన దమ్ము సినిమాలో నటించి, ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే అలా కెరియర్ ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడే ఇండస్ట్రీకి దూరం అవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


బోయపాటి శ్రీను మోసం చేశాడు..

ముఖ్యంగా ఎందుకు ఈ రంగాన్ని వదిలేసాడని ఆయన అభిమానులు అనేక సందర్భాలలో రకరకాల కామెంట్లు కూడా చేశారు. కానీ వేణు తొట్టెంపూడి ఇండస్ట్రీకి దూరం అవడానికి గల కారణాన్ని చెబుతూ.. హీరోగా మార్కెట్ పోయినప్పుడు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి కొంతమంది దర్శకులు తనకి ఒక కథను చెప్పి, చివరికి తన క్యారెక్టర్ ను పూర్తిగా మార్చేశారని, అందుకే ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నానని కూడా ఆయన తెలిపారు. 2012లో జూనియర్ ఎన్టీఆర్ (NTR), బోయపాటి శ్రీను (Boyapati sreenu)కాంబినేషన్లో తెరకెక్కిన దమ్ము సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై యావరేజ్ గా నిలిచింది. ఇందులో వేణు తొట్టెంపూడి కీలకపాత్ర పోషించారు. అయితే డైరెక్టర్ బోయపాటి శ్రీను తనకు కథ చెప్పినప్పుడు హీరో తర్వాత ఆ రేంజ్ పాత్రా అని, కథ కి ఎంతో కీలకమైన పాత్ర అని చెప్పి చివరికి అసలు క్యారెక్టర్ లేని పాత్ర ఇచ్చాడని, అందుకే అప్పటినుండి ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్ చేయకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు వేణు తొట్టెంపూడి.


ఆఖరికి నాగార్జున కూడా..

అంతేకాదు ఈ సినిమా కోసం తాను హీరోగా నటించిన రెండు సినిమాలను కూడా పక్కనపెట్టి కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కాదనుకొని, ఈ సినిమాలో నటిస్తే ఈ సినిమా కాస్త కెరియర్ నే లేకుండా చేసింది అంటూ బాధపడ్డారు. అలాగే గతంలో జరిగిన ఇంకో ఇన్సిడెంట్ ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. నాగార్జున (Nagarjuna) , సుమంత్(Sumanth ) కాంబినేషన్లో వచ్చిన స్నేహం అంటే ఇదేరా సినిమాలో ముందుగా సుమంత్ క్యారెక్టర్ కి వేణుని అనుకున్నారట. రేపు షూటింగ్ అనగా ఈరోజు సాయంత్రం నిర్మాత ఆర్.బి చౌదరి ఆఫీస్ నుంచి..మీరు ఈ సినిమా చేయడం లేదు.. నాగార్జున మీకు బదులుగా ఆయన మేనల్లుడు సుమంత్ ను తీసుకుంటున్నారు అని చెప్పడంతో తాను చాలా బాధపడినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాను.

అందుకే ఇండస్ట్రీకి దూరం అయ్యా..

కేవలం నాగార్జున మీద అభిమానంతోనే నేను హీరోగా చేయాల్సిన ఒక సినిమాను పక్కనపెట్టి మరీ ఈ చిత్రానికి డేట్స్ ఇచ్చాను. అవన్నీ వృధా అయిపోయాయి. డబ్బులు నష్టపోయినా పర్వాలేదు కానీ కనీసం గౌరవం ఇవ్వకుండా తప్పించడం నాకు మరింత ఇబ్బంది కలిగించింది అంటూ ఆయన బాధపడ్డారు. ఈ కారణాలవల్లే ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయాను అని కూడా తెలిపారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×