BigTV English

Suriya: వేస్ట్ ఫెల్లో.. ఎలా నిద్రపడుతోందిరా అని సూర్యను తిట్టిన రఘువరన్.. ఎందుకో తెలుసా.. ?

Suriya: వేస్ట్ ఫెల్లో.. ఎలా నిద్రపడుతోందిరా అని సూర్యను తిట్టిన రఘువరన్.. ఎందుకో తెలుసా.. ?

Interesting facts about Suriya(Celebrity news today): శరవణన్ అనే హీరో తెలుసా మీకు.. ? అతను ఇప్పుడో స్టార్ హీరో.. ఎంతోమంది అభిమానుల గుండెల్లో దేవుడు. గొప్ప మనసున్న వ్యక్తి. తెలుగువారికి కూడా తను సుపరిచితుడే అంటే.. ఏ అసలు ఎవరు ఇతను.. ఆ పేరు కూడా ఎప్పుడు వినలేదే అనుకుంటున్నారా..? శరవణన్ అంటే తెలియడం లేదా.. పోనీ సూర్య అని చెప్తే.. ఏంటి సూర్య తెలియని వారుంటారా.. ? అని అంటారా.. ? అయితే శరవణన్, సూర్య ఒక్కరే.


సూర్య అసలు పేరు శరవణన్. ఈ విషయం చాలామందికి తెలియదు. చిన్నతనం నుంచి సూర్య.. ఇండస్ట్రీలోనే పెరిగాడు. సూర్య నాన్న శివకుమార్ ఒకప్పటి హీరో. ఆయనను చూస్తూ పెరిగినా కూడా సూర్యకు నటన మీద ఆసక్తి కలగలేదు. కానీ,ఒకానొక సమయంలో తండ్రికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల వలన చదువును పక్కన పెట్టి గార్మెంట్ పనిలో చేరి ఎంతోకొంత డబ్బు సంపాదించి ఇచ్చేవాడు.

అప్పుడు కూడా సినిమాల వైపు ఆసక్తి చూపలేదు. కానీ, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో సూర్యకు సినిమా తప్ప వేరే దారి కనిపించలేదు. అలా సినిమాల్లోకి అడుగుపెట్టాడు. సూర్య మొదటి సినిమాకే మణిరత్నం క్లాప్ ఇవ్వడానికి వచ్చి.. శరవణన్ పేరును సూర్యగా మార్చారు. దళపతి లో రజినీకాంత్ పేరు సూర్య కావడంతో.. అలా ఆ పేరును పెట్టినట్లు మణిరత్నం తెలిపారు.


ఇక మొదట్లో డైలాగ్ చెప్పమన్నా.. నటించమన్నా సూర్యకు వచ్చేది కాదు. దీంతో అక్కడ ఉన్నవారందరూ.. వీళ్ళ నాన్న ఎంత గొప్ప నటుడో.. వీడంత వేస్ట్ ఫెల్లో అని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే ఒకరోజు రాత్రి నటుడు రఘువరన్ తో పాటు సూర్యలో ట్రైన్ లో వెళ్తున్నాడట.

అసలేం పట్టనట్టు సూర్య గాఢ నిద్రలో ఉండగా .. రఘువరన్ వచ్చి లేపి.. ” ఎలా నిద్రపడుతోందిరా.. ఏం సాధించావని పడుకున్నావ్. ఇంకా ఎంతకాలం మీ నాన్న పేరు చెప్పుకొని ఇండస్ట్రీలో బతుకుతావ్” అని తిట్టారట. ఆయన మాటలకు బాధపడిన సూర్య.. నటనపై శ్రద్ధపెట్టి.. ఇంగ్లీష్ సినిమాలు చూసి హావభావాలను నేర్చుకున్నాడట. ఆ తరువాత సూర్య ఒక మంచి హీరోగా నిలబడి.. ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

ఆరోజు రఘువరన్ తిట్టిన తిట్ల వలనే సూర్య ఈరోజు హీరోగా మారాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక రఘువరన్, సూర్య కాంబోలో పోరాటం అనే సినిమా వచ్చింది. అందులో వీరిద్దరూ తండ్రీకొడుకులుగా కనిపించారు. నేడు సూర్య పుట్టినరోజు కావడంతో ఆయన గురించిన ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×