BigTV English

Suriya : 42వ మూవీ టైటిల్‌ ‘కంగువ’.. అర్థమేంటో తెలుసా..?

Suriya : 42వ మూవీ టైటిల్‌ ‘కంగువ’.. అర్థమేంటో తెలుసా..?

Suriya : తమిళ హీరో సూర్య 42వ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దర్శకుడు సిరుత్తే శివ ఈ మూవీని పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ టైటిల్ ఖరారైంది. టైటిల్ ను చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ఈ సినిమాకు కంగువ అనే పేరు పెట్టారు. కంగువ అంటే అగ్నిశక్తి ఉన్న వ్యక్తి. అంటే పరాక్రమవంతుడి అని అర్థం. ఈ మూవీలో సూర్య గంభీరమైన పాత్ర పోషిస్తున్నాడు.


సూర్య అంటేనే పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసే నటుడు. అందుకే విభిన్నకథలను ఎంచుకుంటాడు. ప్రేక్షకులకు కొత్త కథలను పరిచయం చేస్తాడు. సినిమా సినిమాకు తనలోని విభిన్న నటుడిని ఆవిష్కరిస్తాడు. ఈ మూవీలోనూ సూర్య ఓ డిఫరెంట్ పాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సూర్య42పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవా, చైన్నైలో జరుగుతోంది. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తైంది. ఈ సినిమా 10 భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. 2D, 3D ఫార్మాట్స్‌లో ఈ మూవీని విడుదల చేయనున్నారు. త్వరలోనే షూటింగ్‌ను పూర్తి చేసి రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. 2024లో కంగువను భారీగా రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×