Mahesh Babu : ఎట్టకేలకు అక్కినేని ఇంట్లో రెండోసారి పెళ్లి భాజాలు మోగాయి. అక్కినేని అఖిల్ (Akkineni Akhil)గత రెండు సంవత్సరాలుగా తాను ప్రేమించిన ప్రముఖ నటి జైనాబ్ రవ్ డ్జీ (Zainaab Ravdjee) తో ఏడడుగులు వేశారు. జూన్ 6వ తేదీన ఉదయం 3 గంటలకు తన ఇంట్లో..ఆమె మెడలో తాళి కట్టి కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు ఈ జంట. ఇకపోతే వివాహానికి అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు, బంధుమిత్రులు హాజరవ్వగా.. నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ బడా హీరోలు తమ ఫ్యామిలీతో వచ్చి సందడి చేశారు.
అఖిల్ రిసెప్షన్లో స్పెషల్ అట్రాక్షన్ గా మహేష్ బాబు..
ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా మహేష్ బాబు (Mahesh Babu) ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక్కడ సితార (Sitara) పింక్ కలర్ లెహంగాలో బాపు బొమ్మలా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఇకపోతే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచిన మరో అంశం మహేష్ బాబు ధరించిన టీ షర్ట్. ఆ టీ – షర్టు అందరి దృష్టిని ఆకట్టుకోవడంతో ఇప్పుడు అందరూ దాని ధర ఎంత? అని తెలుసుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు మహేష్ బాబు అఖిల్ అక్కినేని రిసెప్షన్లో ధరించిన టీ షర్టు ధర తెలిసి అందరూ నోరెళ్ళ బెడుతున్నారు.
మహేష్ బాబు ధరించిన టీ షర్టు ధర ఎంతంటే?
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. మహేష్ బాబు ధరించిన ఆ టీ షర్టు Mightychic బ్రాండ్ కి చెందినది. ఇది హెర్మేస్ మెన్ పజిల్ ఫ్లోరల్ స్వెటర్ కావడం గమనార్హం. ఇక దీని ఖరీదు 1775 డాలర్లు అంటే.. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ.1,54,873 అన్నమాట. ఈ విషయం తెలిసి అందరూ నోరేళ్లబెడుతున్నారు. ఎంతైనా సూపర్ స్టార్ రేంజ్ ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక టీ షర్టు కే ఈ రేంజ్ ఖర్చు పెట్టారు అంటే.. ఇక ఆయన జీవితం ఎంత లగ్జరీగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
Also read:Sonali bendre: బిడ్డ లోపల కదులుతున్నా.. అలాంటి పనులు చేశా!
మహేష్ బాబు సినిమాలు..
మహేష్ బాబు కెరియర్ విషయానికి వస్తే.. ఒకప్పుడు వరుసగా తెలుగులోనే సినిమాలు చేస్తూ టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు. అంతే కాదు ఇతర భాష చిత్రాలలో నేరుగా సినిమాలు చెయ్యను అని ఒకప్పుడు ఖరాఖండిగా చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా ఈయన వేరే భాషలలో సినిమా చేయడం లేదు. కానీ తన సినిమాను ఇప్పుడు అన్ని భాషలలో విడుదల చేసి మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి(Rajamouli ) దర్శకత్వంలో ‘ఎస్.ఎస్.ఎం.బి 29’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra)భాగమైన విషయం తెలిసిందే. వీరితోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) విలన్ పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఆర్. మాధవన్ (R.Madhavan) కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ఇప్పుడు మహేష్ బాబు లగ్జరీ నెస్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Anna oka sweatshirt £1,338.34 ( 1,54,873.11 inr) ah 🙄🙄
Nuvu vesukoni giveaway evvochu kada anna @urstrulyMahesh #SSMB29 #MaheshBabu𓃵 #MaheshBabu #AkkineniAkhil #AkhilZainab #AkhilZainabReception #akhilzainabwedding pic.twitter.com/VhhXnmtpEK
— Nellore Pedda Reddy 🔥 (@PeddaReddy02) June 8, 2025