Honeymoon Case: రాజా రఘువంశీ-సోనమ్ హనీమూన్ కేసులో ఏం జరిగింది? అందరి చూపు భార్య సోనమ్‌పై అనుమానాలు రెట్టింపు అయ్యాయా? గతంలో ఆమెకు ఎవరితోనైనా రిలేషన్ షిప్ ఉందా? హనీమూన్ ట్రిప్‌కు తీసుకెళ్లి భర్తను హత్య చేయడమేంటి? రాజా తల్లి ఎలాంటి షాకింగ్ విషయాలు బయటపెట్టింది? సోనమ్‌ను ఎందుకు ఉరితీయాలని డిమాండ్ చేస్తోంది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
కొడుకు రాజా రఘువంశీ హత్య వెనుక కోడలు సోనమ్ ప్రమేయముందని వార్తల నేపథ్యంలో రాజా ఫ్యామిలీని మీడియా పలకరించింది. ఈ క్రమంలో రాజా తల్లి ఉమ రఘువంశీ కీలక విషయాలు వెల్లడించింది. తన కొడుకు హత్యకు సోనమ్ అంతా ప్లాన్ చేసిందని, ఆ విషయాన్ని తాము గుర్తించలేక పోయామని కన్నీరు మున్నీరు అవుతోంది.
తిరుగు ప్రయాణంలో సోనమ్ టికెట్లు బుక్ చేయలేదని చెప్పుకొచ్చారు. కనీసం ట్రిప్‌లో తీసుకున్న ఫోటోలు లేకుండా సోనమ్ జాగ్రత్త పడిందని తేల్చింది. సోనమ్ మేఘాలయకు టిక్కెట్లు బుక్ చేసుకున్నట్లు చెప్పుకొచ్చింది. రాజాను చంపడానికి ప్లాన్ ప్రకారం స్కెచ్ వేసినట్టు ఆమె చెబుతోంది. రాజాకు ఫోటోలు తీసుకోవడం ఇష్టమని తెలిపింది.
మొత్తం పర్యటనలో సోనమ్ ఒక్క ఫోటో, వీడియో కూడా తీసుకోలేదని వెల్లడించింది. రాజా విమానం ఎక్కేముందు ఇండోర్ ఎయిర్‌పోర్టులో దిగన ఫోటో ఉందని, అదే చివరి ఫోటో అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఫోటోలో కొడుకు బంగారు గొలుసు ధరించి ఉండటాన్ని గమనించినట్టు వెల్లడించింది.
ALSO READ: ఇంటి నుంచి బ్యాంకుకు వెళ్లిన యువతి, సూట్ కేసులో శవమై
తన పిల్లలు ఏనాడూ విషయాలు దాచిపెట్టరని కానీ, రాజా కొన్ని విషయాలు బయటకు చెప్పలేదని కన్నీరు మున్నీరు అయ్యింది. రాజా మెడలో గొలుసు విషయమై ప్రధానం ప్రస్తావించింది ఆమె. సోనమ్ ఒత్తిడి చేయడంతో గొలుసు ధరించినట్టు కొడుకు చెప్పిన విషయాన్ని వివరించింది. రాజ్ కుష్వాహా గురించి తనకు తెలియదని, సోనమ్ తల్లిదండ్రులకు అతడి గురించి తెలిసి ఉండవచ్చని అన్నారు.
తన కొడుకుని హత్య చేసినవారిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. అందులో సోనమ్ ఉన్నా ఆమెని ఉరి తీయాలన్నారు. మిగతా ముగ్గురు నిందితులను విచారించాలని పోలీసులను కోరారని తెలిపారు. హనీమూన్ ట్రిప్ కోసం మేఘాలయ వెళ్లిన రాజా ప్రయాణం భయంకరమైన హత్యతో ముగిసింది. తొలుత సోనమ్ నియమించిన హంతకులు చంపారని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు సోనమ్ అరెస్టుతో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 10 రోజుల ట్రిప్‌లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం.
మే 11న రాజా రఘువంశీ- సోనమ్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘనంగా వివాహం చేసుకున్నారు.
మే 20న రఘువంశీ- సోనమ్ దంపతులు మేఘాలయలో తమ హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకుని బయలుదేరారు.
మే 22న రఘువంశీ- సోనమ్ దంపతులు అద్దెకు తీసుకున్న స్కూటర్‌పై పర్యాటక కేంద్రం సోహ్రా (చిరపుంజి)సమీపంలో మావ్లాఖియాత్ గ్రామానికి చేరుకున్నారు.
మే 23న ఈ జంటను చివరి సారిగా స్థానిక గైడ్ ఆల్బర్ట్ చూశాడు. ఆ రోజు ఉదయం 10 గంటల సమయంలో నోంగ్రియాట్ నుండి మావ్లాఖియాట్ వరకు దాదాపు 3,000 మెట్లు ఎక్కడాన్ని గమనించాడు. ఈ దంపతులుతోపాటు ముగ్గురు హిందీ మాట్లాడే యువకులు ఉన్నారు. వారు స్థానికులు కాదన్నది గైడ్ మాట. లివింగ్ రూట్ బ్రిడ్జిలను సందర్శించడానికి ముందు రోజు తన సేవలను ఆ జంటకు అందించానని చెప్పాడు.
మే 24న షిల్లాంగ్- సోహ్రా మధ్య రోడ్డు పక్కనున్న కేఫ్ సమీపంలో ఆ జంట స్కూటర్ ఉంది. దంపతులు కనిపించకపోవడంతో మేఘాలయ పోలీసులు గాలింపు ఆపరేషన్ ప్రారంభించారు.
జూన్ 2న వారం తర్వాత రాజా రఘువంశీ మృతదేహం వీసావ్‌డాంగ్ జలపాతం సమీపంలోని లోతైన లోయలో గుర్తించారు. రాజా బంగారు ఉంగరం, గొలుసు కనిపించకపోవడంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి.
జూన్ 3న మృతదేహం దొరికిన ప్రదేశానికి సమీపంలో రక్తపు మరకలున్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
జూన్ 5న సోహ్రారిమ్ లోయ మధ్య ఉన్న మావ్క్మా గ్రామంలో ఈ జంటకు చెందిన రెయిన్ కోట్ గుర్తించారు. దీంతో మరింత అనుమానాలను తీవ్రమయ్యాయి.
జూన్ 7 నుంచి 8 వరకు మేఘాలయ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ లో ఒకర్ని అరెస్టు చేశారు. మరో ఇద్దరిని ఇండోర్‌లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణ క్రమంలో సోనమ్ ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని నందగంజ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది.
జూన్ 9న మేఘాలయ డీఐజీ ఇదాసిన్హా నోంగ్‌రాంగ్ కీలక విషయాలు బయటపెట్టారు. సోనమ్ తన భర్తను హత్య చేయడానికి హంతకులను నియమించుకున్నట్లు ధృవీకరించారు. మిగతా వారిని పట్టుకోవడానికి మధ్యప్రదేశ్‌లో ఆపరేషన్ కొనసాగుతోంది.
'सोनम ने शिलांग की टिकट करवाई थी' – राजा रघुवंशी की माँ #Rajaraghuwanshi #Sonam #Indore #MadhyaPradesh @IMinakshiJoshi @anuragamitabh pic.twitter.com/Cax4u8qce4
— India TV (@indiatvnews) June 9, 2025