Sonali bendre..సోనాలి బింద్రే (Sonali Bendre).. తెలుగు, హిందీ చిత్రాలలో ఎక్కువగా నటిస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. 1990 – 2000 సంవత్సరపు మధ్యకాలంలో తన అందంతో ఆడియన్స్ ను ఉర్రూతలూగించింది. అంతేకాదు స్టార్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సొంతం చేసుకుంది. మోడల్ గా కెరియర్ ను ఆరంభించింది. 1994లో ‘ఆగ్’ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. మొదటి సినిమాతోనే ఆ సంవత్సరపు నూతన నటిగా ఫిలింఫేర్ అవార్డు సొంతం చేసుకుంది. తర్వాత బాలీవుడ్లో పలు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. తెలుగులో ‘మురారి’ సినిమాతో భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘ఇంద్ర’, ‘మన్మధుడు’, ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ ఇలా పలు చిత్రాలలో నటించిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితమైన విషయం తెలిసిందే.
బిడ్డ కదలికలు తెలుస్తున్నా..8నెలల వరకు అదే పని చేశా – సోనాలి
ఇకపోతే చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన సోనాలి బింద్రే.. తన కెరీర్ లో రెండుసార్లు విరామం తీసుకోవాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ..” మాతృత్వపు దశను నేను పూర్తిగా ఆస్వాదించాను. ఒక సినిమా సీక్వెల్ లో నటించే సమయంలోనే నేను గర్భం దాల్చాను అని తెలిసింది. అయితే విరామం తీసుకోవాలని మాత్రం అనుకోలేదు. ఎందుకంటే నాకు నటన అంటే చాలా ఇష్టం. ఇక నేను గర్భవతిని అని తెలిసిన తర్వాత కూడా దాదాపు 8 నెలలపాటు ప్రతిరోజు షూటింగ్ కి వెళ్లేదాన్ని. లోపల నా బిడ్డ కదలికలు నాకు తెలుస్తున్నా.. నా లోపల ఉన్న బిడ్డకు నేను ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నానేమో అని అనిపించినా సరే.. నటనకే ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చాను.
ముఖ్యంగా నా కడుపులో ఏం జరుగుతోందో కూడా నాకు తెలిసేది కాదు. పనే ముఖ్యమని భావించాను. అలా దాదాపు బిడ్డ జన్మించే వరకు కూడా నేను నటించాను. ఇక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పూర్తిగా విరామం తీసుకున్నాను. అప్పటివరకు నటిగా నా బాధ్యతలు నిర్వర్తించిన నేను.. తల్లిగా కూడా నా బాధ్యతలు నిర్వర్తించాలి కదా.. అందుకే విరామం తీసుకుని మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదించాను” అంటూ మాతృత క్షణాలను గుర్తు చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది సోనాలి బింద్రే.
ALSO READ: Rhea Chakraborty: మా కుటుంబ నాశనానికి కారణం ఆ స్టార్ హీరో.. రియా ఎమోషనల్ కామెంట్స్!
క్యాన్సర్ వల్ల మరోసారి విరామం..ఆ స్టార్ హీరో అండగా నిలిచారు..
ఆ తర్వాత నటన రంగంలోకి అడుగుపెట్టినప్పుడు.. ఒక షో చేసేదాన్ని.. ఆ షో చేస్తున్నప్పుడే నాకు క్యాన్సర్ నిర్ధారణ అయింది. దీంతో నా కెరియర్ కి మరోసారి బ్రేక్ పడింది. ఇకపోతే నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు నేను చికిత్స తీసుకుంటున్న సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నాకు అండగా నిలిచారు. న్యూయార్క్ లో నాకు చికిత్స ఎలా జరుగుతోంది ? అనే విషయాన్ని ఆయన రోజు ఆరా తీసేవారు. రెండుసార్లు న్యూయార్క్ కి వచ్చి మరీ నన్ను పరామర్శించారు. ఇక ఆ సమయంలో నేను మానసికంగా కూడా కోలుకోవడానికి నాకు సల్మాన్ ఖాన్ ఎంతో మద్దతు ఇచ్చారు అంటూ తెలిపింది సోనాలి బింద్రే. మొత్తానికైతే తన జీవితంలో రెండు దశలు చూశానని చెప్పుకొచ్చింది.