Luckiest Batter: క్రికెట్ అంటేనే ఫన్నీ గేమ్. ఇందులో వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉంటాయి. కొన్ని సంఘటనలు నవ్వు తెప్పిస్తే… మరికొన్ని సంఘటనలు కాస్త భయంకరంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే… తాజాగా జరిగిన ఓ సంఘటన… చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే బంతి నేరుగా వెళ్లి వికెట్లకు తాకినా కూడా… ఆ బ్యాటర్ను అవుట్ గా ప్రకటించలేదు అంపైర్. ఈ సంఘటన గత డిసెంబర్ మాసంలో జరగగా… ఇప్పుడు వైరల్ అవుతుంది.
98 పరుగుల వద్ద ఆ క్రికెటర్ కు లక్కు
98 పరుగుల వద్ద చిరాగ్ గాంధీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయినప్పటికీ అంపైర్ మాత్రం దాన్ని అవుట్ గా ప్రకటించలేకపోయాడు. దీనికి ప్రత్యేక కారణం ఉంది. బంతి వికెట్లను తాగినా కూడా… బెల్స్ మాత్రం కింద పడలేదు. రూల్స్ ప్రకారం బెల్స్ కింద పడితేనే అవుట్ గా ప్రకటిస్తారు. ఇక్కడ అదే చిరాకు గాంధీకి… కలిసి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
సూరత్ లోని లాల్బాగ్ కాంట్రాక్టర్ స్టేడియంలో బిగ్ క్రికెట్ లీగ్ 2024 మ్యాచ్ లో ( Big Cricket League 2024 Match ) ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ బ్రిడ్జ్ స్టార్స్ వర్సెస్ ఎంపీ టైగర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా… యూపీ బ్రీజ్ స్టార్స్ జట్టుకు ( UP Breeze Stars) సంబంధించిన ఆటగాడు చిరాగ్ గాంధీ 98 పరుగులు చేసి బ్యాటింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో ఎంపీ టైగర్స్ జట్టుకు సంబంధించిన స్పిన్నర్ పవన్ నేగి బౌలింగ్ వేశాడు. ఎలాగైనా అవుట్ చేయాలన్న కసితో తన బంతిని వదిలాడు. అయితే టెంప్ట్ అయినా చిరాగ్ గాంధీ… వికెట్ కోల్పోయాడు. పవన్ నేగి వేసిన బంతి నేరుగా వికెట్లను తగిలింది. కానీ బేల్స్ మాత్రం కింద పడలేదు. అయినప్పటికీ బౌలింగ్ టీం సెలబ్రేషన్స్ చేసుకుంది. కానీ అంపైర్ మాత్రం అవుట్ చేయలేకపోయాడు. చిరాకు గాంధీ నాట్ ఔట్ అంటూ ప్రకటించాడు. దీంతో చిరాగ్ గాంధీ.. తన ఇన్నింగ్స్ కొనసాగించాల్సి వచ్చింది.
అద్భుతమైన సెంచరీతో రెచ్చిపోయిన గాంధీ
98 పరుగుల వద్ద మంచి లైఫ్ రావడంతో చిరాగ్ గాంధీ ( CHIRAG GANDHI) రెచ్చిపోయాడు. గత సంవత్సరం జరిగిన ఈ మ్యాచ్లో సెంచరీ చేసి దుమ్ము లేపాడు. ఇక ఈ మ్యాచ్లో.. ఎంపీ టైగర్స్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. దీంతో యూపీ బ్రిడ్జి స్టార్స్ ను 71 పరుగులతో తేడాతో ఓడించింది. కానీ ఈ మ్యాచ్లో గాంధీ చేసిన సెంచరీ మాత్రం హైలెట్గా నిలవడం గమనార్హం.
Also Read: Sharayu Kulkarni- Pant: మీ దుంపలు తెగ…ఈ జంపింగ్స్ ఏంట్రా… పంత్ తరహాలో మరో లేడీ సెలెబ్రేషన్స్
The luckiest batter in the world while batting on 98*. 😄pic.twitter.com/iTvu6JwCqs
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2025