E-Paper
Advertisement

Tamannaah: అలాంటి వ్యక్తితో రిలేషన్ కరెక్ట్ కాదనిపించింది, అప్పుడే నా హృదయం ముక్కలయ్యింది – తమన్నా

Tamannaah: అలాంటి వ్యక్తితో రిలేషన్ కరెక్ట్ కాదనిపించింది, అప్పుడే నా హృదయం ముక్కలయ్యింది – తమన్నా
Advertisement

Tamannaah About Heart Break: టాలీవుడ్, బాలీవుడ్.. ఇలా రెండు ఇండస్ట్రీలను చూసినవారు వాటి మధ్య పోలికల గురించి మాట్లాడడం చాలా కామన్. ముఖ్యంగా బాలీవుడ్‌లో స్టార్లు అయిన హీరోయిన్లు కూడా సౌత్ సినిమాలపై తమ అభిమానాన్ని బయటపెడుతుంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మిల్కీ బ్యూటీ తమన్నా కూడా సౌత్ ఇండస్ట్రీకి, బాలీవుడ్‌కు ఉన్న తేడా గురించి మాట్లాడడం మాత్రమే కాకుండా తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా ప్రేక్షకులతో పంచుకుంది. తన హార్ట్ బ్రేక్స్ గురించి ఓపెన్‌గా స్టేట్‌మేంట్స్ ఇచ్చింది. ప్రస్తుతం విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో ఉన్న తమన్నా.. ఇలాంటి సమయంలో హార్ట్ బ్రేక్ గురించి మాట్లాడడం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా చేరుతుంది

Advertisement

సినిమాలో హీరోయిన్‌గా అవకాశాలు రాకపోయినా స్పెషల్ సాంగ్ చేయడానికి కూడా వెనకాడకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. అలాగే తాజాగా శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటించిన ‘స్త్రీ 2’లో ‘ఆజ్ కీ రాత్’ అంటూ తమన్నా చేసిన పాట యూత్‌ను ఉర్రూతలూగించింది. మూవీ రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వడంతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. అందులో సౌత్‌కు, బాలీవుడ్‌కు ఉన్న తేడాలపై వ్యాఖ్యలు చేసింది. ‘‘సౌత్ సినిమాల్లో నేను గమనించిన ముఖ్యమైన తేడా ఏంటంటే వారు వారి ప్రాంతాల గురించి ఎక్కువగా చెప్పాలనుకుంటారు. అందుకే వారి కంటెంట్ ప్రపంచవ్యాప్తంగా చేరుతుంది అనుకుంటున్నాను’’ అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేసింది తమన్నా.

Also Read: ఏంటిది రుహానీ.. మరీ ఇంత బోల్డ్ అయితే ప్రేక్షకులు తట్టుకోగలరా? ఇది ఫ్యామిలీతో చూసే సినిమా కాదండి!

Advertisement

కొందరి కోసమే

‘‘సౌత్‌లో మనుషుల్లోని లక్షణాల గురించి కథలు చెప్పడానికి ప్రయత్నించరు. మనుషుల ఎమోషన్స్‌పై ఎక్కువగా దృష్టిపెడతారు. తల్లిదండ్రులకు సంబంధించిన ఎమోషన్, అన్న, చెల్లిపై ప్రతీకారం.. ఇలాంటి ఎమోషన్స్‌ను తీసుకొని వేర్వేరు విధాలుగా కథలను చెప్పాలనుకుంటారు. వాళ్ల దృష్టికోణాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపించాలని అనుకుంటారు. వాళ్లు వేర్వేరు మనుషుల గురించి చెప్పాలని అనుకోరు. వారికి పూర్తిగా ఏది తెలిస్తే దానిగురించి మాత్రమే చెప్తారు. అది సౌత్ వాళ్లకు నిజంగా వర్కవుట్ అయ్యింది. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు కేవలం కొందరి కోసం మాత్రమే తెరకెక్కించారు’’ అంటూ సౌత్ గురించి గొప్పగా మాట్లాడింది తమన్నా.

రెండుసార్లు హర్ట్‌బ్రేక్

ఇక తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. తను పలు రిలేషన్స్‌షిప్స్‌లో ఉన్నానని, వాటి వల్ల తనకు చేదు అనుభవాలే ఎదురయ్యాయని బయటపెట్టింది. తను టీనేజ్‌లో ఉన్నప్పుడు తొలిసారి ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చింది. ఒక వ్యక్తి కోసం తనకు నచ్చిన జీవితాన్ని వదులుకోవడం నచ్చక, ఏదో సాధించాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే ఉద్దేశ్యంతోనే తనకు బ్రేకప్ చెప్పానని గుర్తుచేసుకుంది. ఆ తర్వాత కొన్నిరోజులకు మరొక వ్యక్తితో రిలేషన్‌లోకి వెళ్లానని, కానీ కొన్నాళ్లకే అతడు తనకు కరెక్ట్ కాదనిపించిందని తెలిపింది. అలాంటి వ్యక్తితో రిలేషన్ ప్రమాదని తెలుసుకున్నానని చెప్పింది. అలా తనకు రెండుసార్లు బ్రేకప్ అయ్యి, రెండుసార్లు తన హృదయం ముక్కలయ్యిందని చెప్పుకొచ్చింది తమన్నా.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×