BigTV English

Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో 29 పతకాలతో ఘనంగా ముగించిన భారత్

Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో 29 పతకాలతో ఘనంగా ముగించిన భారత్

India’s Historic Campaign Ends with a Record of 29 Medals in Paris Paralympics 2024: ఒక టార్గెట్ అనుకుని వెళ్లడం వేరు, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అద్భుతమైతే, అంతకుమించి సాధించడమనేది మహాద్భుతమని అందరూ భారత అథ్లెట్లను అభినందిస్తున్నారు. పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు 29 పతకాలతో మెరిశారు. విశ్వ క్రీడల్లో భారత పతాకం సగర్వంగా ఎగిరేలా చేశారు.


మొత్తమ్మీద పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు సత్తాచాటారు. వైకల్యమనేది శరీరానికే కానీ, ప్రతిభకు కాదని నిరూపించారు.  25 పతకాల లక్ష్యంగా విశ్వ క్రీడల బరిలోకి దిగి, టార్గెట్ ను మంచి.. 29 పతకాలతో ఘనంగా ముగించారు. సగర్వంగా భారత్ తిరిగి వస్తున్నారు.

పారిస్ పారాలింపిక్స్ లో పాల్గొనేందుకు భారత్ నుంచి 84 మంది అథ్లెట్లు బయలుదేరారు. 29 మెడల్స్ సాధించారు. ఇందులో ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. పారాలింపిక్స్ లో పాల్గొన్న దేశాల్లో 18వ స్థానంలో నిలిచారు. గత టోక్నో పారాలింపిక్స్‌ 19 పతకాలను సాధించిన భారత్, ఈసారి అంతకుమించి 10 పతకాలను అధికంగా సాధించడం విశేషం.


1968 నుంచి పారాలింపిక్స్‌లో చూస్తే, 2024లోనే అత్యధికంగా 29 మెడల్స్ సాధించి రికార్డు సృష్టించారు. ఇకపోతే ఈ విశ్వక్రీడల్లో మన పతక విజేతల పూర్తి జాబితా ఇదే,,,

స్వర్ణ పతకాలు సాధించిన అథ్లెట్లు

1. అవని లేఖరా – స్వర్ణం (షూటింగ్) 10మీ ఎయిర్‌ రైఫిల్, ఎస్ హెచ్ 4
2. నితేష్ కుమార్ – స్వర్ణం (బ్యాడ్మింటన్) పురుషుల సింగిల్స్, ఎస్ఎల్ 2
3. సుమిత్‌ అంటిల్‌ – స్వర్ణం (అథ్లెటిక్స్) జావెలిన్ త్రో ఎఫ్ 64
4. హర్విందర్ సింగ్ – స్వర్ణం (ఆర్చరీ) పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్
5. ధరంబీర్ సింగ్ – స్వర్ణం (అథ్లెటిక్స్) పురుషుల క్లబ్ త్రో 51
6. ప్రవీణ్ కుమార్ – స్వర్ణం (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్ టీ 64
7. నవదీప్ సింగ్ – స్వర్ణం (అథ్లెటిక్స్) పురుషుల జావెలిన్ త్రో, ఎఫ్ 41

రజత పతకాలు సాధించిన అథ్లెట్లు

1. మనీశ్‌ నర్వాల్ – రజతం (షూటింగ్) పురుషుల ఎయిర్‌ పిస్టల్ ఎస్ హెచ్ 1
2. నిషాద్ కుమార్ – రజతం (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్, టీ 47
3. యోగేశ్ కతునియా – రజతం (అథ్లెటిక్స్‌) పురుషుల డిస్కస్ త్రో,  ఎఫ్ 56
4. శరద్ కుమార్ – రజతం (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్ టీ 63 (అథ్లెటిక్స్)
5 తులసిమతి మురుగేశన్ -రజతం (బ్యాడ్మింటన్) మహిళల సింగిల్స్ ఎస్ యూ 5
6. అర్జీత్‌ సింగ్‌ – రజతం (అథ్లెటిక్స్‌) పురుషుల జావెలిన్ త్రో, ఎఫ్ 46
7. సుహాస్ యతిరాజ్ – రజతం (బ్యాడ్మింటన్) పురుషుల సింగిల్స్, ఎస్ఎల్ 4
8. సచిన్‌ ఖిలారీ – రజతం (అథ్లెటిక్స్) పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌ 46
9. ప్రణవ్ – రజతం (అథ్లెటిక్స్) పురుషుల క్లబ్ త్రో 51

Also Read: వారెవ్వా.. ధ్రువ్ మామూలోడు కాదు.. ధోని రికార్డుకే ఎసరు పెట్టాడు!

కాంస్య పతకాలు సాధించిన అథ్లెట్లు

1. మోనా అగర్వాల్ – కాంస్యం (షూటింగ్) మహిళల 10మీ ఎయిర్‌ రైఫిల్, ఎస్ హెచ్1
2. ప్రీతి పాల్ – కాంస్యం (అథ్లెటిక్స్) మహిళల 100 మీ, టీ 35
3. రుబీనా ఫ్రాన్సిస్‌ – కాంస్యం (షూటింగ్) మహిళల 10మీ ఎయిర్‌పిస్టల్, ఎస్ హెచ్  1
4.ప్రీతి పాల్ – కాంస్యం (అథ్లెటిక్స్‌) మహిళల 200 మీ, టీ 35
5. మనీశా రామదాస్ – కాంస్యం (బ్యాడ్మింటన్) మహిళల సింగిల్స్, ఎస్ యూ 5
6. రాకేశ్‌ కుమార్/శీతల్ దేవి – కాంస్యం (ఆర్చరీ) ఆర మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్
7. నిత్య శ్రీ శివన్ – కాంస్యం (బ్యాడ్మింటన్) మహిళల సింగిల్స్, ఎస్ హెచ్ 6
8. దీప్తి జీవాంజి – కాంస్యం (అథ్లెటిక్స్) మహిళల 400 మీటర్ల టీ 20
9. మరియప్పన్ తంగవేలు – కాంస్యం (అథ్లెటిక్స్) పురుషుల హైజంప్ టీ 63
10. గుర్జర్‌ సుందర్‌ సింగ్‌ – కాంస్యం (అథ్లెటిక్స్) పురుషుల జావెలిన్ త్రో ఎఫ్ 46
11. కపిల్ పర్మార్ – కాంస్యం (జూడో) పురుషుల -60 కేజీల జే1
12 హొకాటో హొటోజి సెమా – కాంస్యం (అథ్లెటిక్స్‌) పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌57
13. సిమ్రాన్ – కాంస్యం (అథ్లెటిక్స్) మహిళల 200 మీటర్ల టీ12

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×