BigTV English

Tamannaah Bhatia : ల‌వ్ మేట‌ర్‌లో త‌మ‌న్నా ట్విస్ట్‌

Tamannaah Bhatia : ల‌వ్ మేట‌ర్‌లో త‌మ‌న్నా ట్విస్ట్‌
Tamannaah Bhatia


Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉంది. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలోనూ తెగ యాక్టివ్‌గా ఉంటోంది. అయితే బాలీవుడ్‌లో సెటిలైన టాలీవుడ్ యాక్ట‌ర్ విజ‌య్ వ‌ర్మ‌తో ప్రేమ‌లో ఉంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఎప్పుడూ సినిమాల‌తో బిజీగా ఉండే ఆమెపై ఈ వార్త‌లు రావ‌టానికి కార‌ణం.. న్యూ ఇయ‌ర్ రోజున వారిద్ద‌రూ క్లోజ్‌గా ఉన్న ఫొటోలు బ‌య‌ట‌కు రావ‌టమే. అంతే కాదండోయ్ ఇద్ద‌రూ క‌లిసి ఎయిర్ పోర్టులో సంద‌డి కూడా చేశారు. ఆ ఫొటోలు, వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అదే త‌రుణంలో వారిద్ద‌రూ త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

అప్పుడంతా విజ‌య్ వ‌ర్మ‌తో రిలేష‌న్ షిప్ గురించి స్పందించ‌ని త‌మన్నా.. రీసెంట్‌గా స్పందించింది. నేను, విజ‌య్ క‌లిసి ఓ సినిమాలో న‌టించాం. అప్ప‌టి నుంచి మాపై వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే వీటిపై స్పందించాల్సిన అవ‌స‌రం నాకు లేదు. ఇంత‌కు మించి చెప్పాల్సిన విష‌యాలు లేవు. డాక్ట‌ర్ నుంచి బిజినెస్‌మ్యాన్ వ‌ర‌కు ఇప్ప‌టికే చాలాసార్లు నా పెళ్లి చేసేశారు. అంటూ త‌న పెళ్లిపై వ‌చ్చిన వార్త‌ల‌ను వ్యంగ్యంగా ఖండించింది త‌మ‌న్నా. దీంతో విజ‌య్ వ‌ర్మ మ‌ధ్య ల‌వ్ లాంటిది ఏదీ లేద‌ని చెప్ప‌క‌నే చెప్పేసింది త‌మన్నా.


ఇక సినిమాల విష‌యానికి వస్తే.. ప్ర‌స్తుతం త‌మ‌న్నా రెండు పెద్ద చిత్రాల్లో న‌టిస్తుంది. అందులో ఒక‌టి సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ మూవీ జైల‌ర్‌. ఇందులో త‌మ‌న్నా ఏ పాత్ర చేస్తుంద‌నేది క్లారిటీ లేదు. మ‌రో వైపు మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భోళా శంక‌ర్‌లోనూ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. రెండు సినిమాలు స‌మ్మ‌ర్‌లో అటు ఇటుగా రిలీజ్ అవబోతున్నాయి.హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన తమన్నా లుక్, ఫిజిల్ విషయంలో ఇప్పటికీ కుర్ర హీరోయిన్స్‌కు గట్టి పోటీనే ఇస్తుంది. మ్యాస్ట్రో వంటి సినిమాలో గ్రే షేడ్‌లో నటించి మెప్పించింది. స్పెషల్ సాంగ్స్‌లోనూ ఆడిపాడుతుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×