Tamannaah Bhatia : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ( Tamannaah Bhatia) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండేది. అప్పటిలో స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. ఈమె ఈ మధ్య బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉంది. అటు తమిళ్ సినిమాల్లో కూడా నటిస్తూ వస్తుంది. హిందీలో పలుచిత్రాల్లో మెరిసిన తమన్నా ఇక ప్రస్తుతం అక్కడే వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. తెలుగులోనూ జోరు తగ్గకుండా చూసుకుంటోంది. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటున్న తమన్నా ఎప్పుడూ ఏదోలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది.. నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. తాజాగా ఈమె తన టాప్ సీక్రెట్ ను రీవిల్ చేసింది. ప్రస్తుతం అది హాట్ టాపిక్ గా మారింది.. అది విన్న ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా అవుతారో చూద్దాం..
నిత్యం సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా సోషల్ మీడియాలో అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. తాజాగా తన టాప్ సీక్రెట్ ను రీవిల్ చేసింది. మిల్క్ బ్యూటికి స్నానం చేసాక ఒక విచిత్ర అలవాటు ఉందట. ఇటీవల తను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకున్న ఆ అలవాటు గురించి ఓపెన్ అయ్యింది. స్నానం చేశాక తమన్నా భాటియా ఇలా చేస్తుందంట.. ఫుల్ డే వర్క్ చేస్తే మాత్రం.. స్నానం చేశాక తన బాడీలోని ప్రతి పార్ట్ ను టచ్ చేసి థ్యాంక్యూ చెప్తుందంట. ఛీ.. ఛీ ఏంటి ఈ అలవాటు అంటూ ఆ వీడియో కు కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
Also Read:ఆ ఒక్క రోజు జరిగిందే మాస్టర్ కు శాపంగా మారిందా..? వెలుగులోకి మరో నిజం..
అసలు విషయానికొస్తే… తమన్నా దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఇది వినాడానికి వింతగానే ఉంటుంది.. కానీ ఎందుకు అలా చేయకూడదు. బాడీలోని ప్రతి భాగం మనకు సహకరిస్తున్నందుకు అలా చేయడంలో తప్పేమీ లేదు. మనల్ని మనం ప్రేమించుకుంటేనే మానసిక ఆనందం ఉంటుందని ఆమె అన్నారు. ఇక ఇలాంటి భిన్నమైన అలవాటు ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నిజానికి తమన్నా తన హెల్తీపైన ఎంత శ్రద్ధ వహిస్తుంటారో ఆమె అలవాటు ద్వారా తెలుస్తుందోని అంటున్నారు.. ఇక ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరించేందుకు రెడీ అవుతుంది. తెలుగు హిందీ తమిళ్ వరుస చిత్రాలతో పాటు టీవీ షో లలో కూడా మెరుస్తూ అభిమానులకు తన అందంతో కట్టిపడేస్తుంది. సినిమాల సంగతి పక్కన పెడితే తమన్నా త్వరలో పెళ్లి పీటలు ఎక్కువ పోతుందంటూ రోజుకో వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంటుంది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ తో పీకల్లోతూ ప్రేమలో ఉంది.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చూడాలి.. ముంబయిలో సెటిల్ అవ్వాలని ఇద్దరు అనున్నారట. సొంతిల్లు కొనాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఆ ఇంట్లోనే పెళ్లి పనులు మొదలు పెట్టి త్వరగా పెళ్లి చేసుకొని పిల్లలను జనాలనే ప్లాన్ లో ఉన్నారని సమాచారం..