OTT Movie : మలయాళం నుంచి వచ్చే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాయి. ఈ సినిమాలను మన ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునే క్రైమ్ థ్రిల్లర్ మూవీ, చివరి వరకు ట్విస్ట్ లతో అదరగొడుతుంది. ఇందులో చిన్నపిల్లలపై అఘాయిత్యాలు చేసే వారిని హీరో శిక్షిస్తుంటాడు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
సోనీ లివ్ (SonyLIV) లో
ఈ మలయాళం మూవీ పేరు ‘ఈషో’ (Esho). ఈ మలయాళ థ్రిల్లర్ మూవీకి నాదిర్షా దర్శకత్వం వహించారు. జయసూర్య, నమితా ప్రమోద్ ప్రధాన పాత్రల్లోనటించారు. సునీష్ వరనాద్ కధ రాయగా, అరుణ్ నారాయణ్ ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీ 5 అక్టోబర్ 2022 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (SonyLIV) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
శివాని స్కూల్లో మంచిగా చదువుతూ ఉంటుంది. ఆమె తల్లి యాని ఇంట్లోనే ఉంటూ, కూతుర్ని బాగా చూసుకుంటూ ఉంటుంది. భర్త దుబాయ్ లో ఉండటంతో, కూతురి పాటల వీడియోలను భర్తకి పంపిస్తూ ఉంటుంది. అలా సరదాగా సాగిపోతున్న వీళ్ళ జీవితం, ఓ వ్యక్తి వల్ల అల్లకల్లోలం అవుతుంది. స్కూల్లో శివానిపై పాఠాలు చెప్పే మాస్టర్ అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు. ఇది తెలుసుకున్న టీచర్లు ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేస్తారు. ఈ విషయం వాచ్మెన్ కి కూడా తెలియడంతో, అతన్ని పిలిపించి అడుగుతారు. అయితే వాచ్మెన్ శివాని తల్లికి, స్కూల్ మాస్టర్ కి అక్రమ సంబంధం అంటగడతాడు. వాళ్ళిద్దరికీ మనస్పర్ధలు రావడంతో, కేసు పెట్టడానికే ఇలా చేస్తుందని చెప్పడంతో వాళ్ళు చాలా బాధపడతారు. ఇంటికి వెళ్లి తల్లి కూతుర్లు ఆత్మహత్య చేసుకుంటారు. ఆ తర్వాత మరోవైపు పిల్లై ఒక సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తుంటాడు. అతడు మరుసటి రోజు కోర్టులో కొంతమందికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. జోవియర్ అనే వ్యక్తి చిన్నపిల్లలపై అఘాయిత్యం చేస్తుంటాడు. ఈ విషయం తెలుసుకున్న పిల్లై పోలీసులకి కంప్లైంట్ చేస్తాడు. కోర్టులో కూడా సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది.
అతన్ని చంపాలని ఈషో అనే వ్యక్తిని ఆ దుర్మార్గులు పంపిస్తారు. ఈషో అతనికి డబ్బులు తీసుకుని కేసు వదిలేయచ్చుగా అని చెప్తాడు. అందుకు అతను ఒప్పుకోకపోవడంతో, అతన్ని ఒక రహస్య ప్రదేశానికి తీసుకువెళ్తాడు. నిజానికి ఈషో ఎవరో కాదు ఆత్మహత్య చేసుకున్న శివాని తండ్రి. భార్య పిల్లల్ని అనవసరంగా ఇరికించినందుకు హత్య చేసి జైలుకు వెళ్లి ఉంటాడు. జైలు నుంచి వచ్చాక అటువంటి దుర్మార్గులకు బుద్ధి చెబుతుంటాడు. ఈ క్రమంలోనే పిల్లై దగ్గర కూడా వస్తాడు. అయితే పిల్లై డబ్బులకు లొంగకపోవడంతో, అతని నిజాయితీని మెచ్చుకుంటాడు. ఒకవేళ డబ్బులు తీసుకొని ఉంటే చంపేసేవాడినని చెప్తాడు. ఆ తర్వాత అతన్ని కాపాడడానికి ప్రయత్నిస్తాడు. చివరికి ఈషో, పిళ్ళైని కాపాడతాడా? ఈషో ఈ దుర్మార్గులకు కూడా బుద్ధి చెప్తాడా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడాల్సిందే.