Jani Master : టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రేష్ట వర్మ లైంగిక ఆరోపణలు చేస్తూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని జానీ మాస్టర్ ని అరెస్ట్ చేశారు. దాదాపు నెలరోజుల పాటు చంచల్ గూడా జైల్లో ఆయనను ఉంచారు. ఆ తర్వాత బెయిల్ రావడంతో ఆయన్ను రిలీజ్ చేశారు. బయటికి వచ్చిన జానీ మాస్టర్ తన తప్పేమీ లేదంటూ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానంటూ కొన్ని మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చారు.. ఇక రీసెంట్గా శ్రేష్ఠ వర్మ కూడా ఓ మీడియా ఛానల్ ముందుకు వచ్చి నేను ఏ తప్పు చేయలేదు ముసుగు వేసుకోవాల్సిన అవసరం నాకు లేదంటూ సంచలన విషయాలను బయటపెట్టింది.. ఆ వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది. తాజాగా మరో కొరియోగ్రాఫర్ కస్తూరి జానీ మాస్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. జానీ మాస్టర్ గురించి ఎన్నో విషయాలను ఆమె షేర్ చేశారు. మాస్టర్ చేసిన ఆ ఒక్క తప్పు వల్లే మాస్టర్ ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారని ఆమె అన్నారు. అసలు జానీ మాస్టర్, శ్రేష్ఠ వర్మ మధ్య ఏం జరిగింది కొరియోగ్రాఫర్ కస్తూరి ఏం చెప్పిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జానీ మాస్టర్, శ్రేష్ఠ వర్మ మధ్య సంబంధం..?
డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ గురించి అందరికీ తెలిసిందే.. ఆయన ఇటీవల లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతేకాదు అరెస్టయి జైల్లో ఉన్నారు ఆ తర్వాత బెయిల్ రావడంతో విడుదలయ్యి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే, శ్రేష్ట వర్మ, జానీ మాస్టర్ మధ్య ఏం జరిగింది అనే విషయం ఇప్పటికీ అందరికీ అనుమానంగానే ఉంది.. జానీ మాస్టర్ ఇండస్ట్రీలో ఎంతోమంది కొరియోగ్రాఫర్లకు మంచి లైఫ్ ను ఇచ్చారు. కష్టపడే వారికి డాన్సర్ గా మంచి గుర్తింపు వచ్చేలా అందరికీ మంచే చేశారని ఆయన అభిమానులు అంటున్న విషయం తెలిసిందే.. శ్రేష్ట వర్మను కూడా అలానే తన టీం లో చేర్చుకున్నారు. కొన్నేళ్లు బాగానే ఉన్నా వీళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. అయినా కూడా వీళ్ళిద్దరూ దాదాపు 8 ఏళ్ల పాటు బాగానే ఉన్నారు. ఈమధ్య జాతీయ అవార్డుని జానీ మాస్టర్ కు ప్రకటించిన తర్వాత లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. అవార్డు క్యాన్సిల్ అయింది. ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎనిమిదేళ్లు కలిసి ఉన్న కొరియోగ్రాఫర్ సడన్గా ఇలా పెళ్లి చేసుకోవాలని తనని మోసం చేశారని కేసులు పెట్టడం ఏంటని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తాజాగా జానీ మాస్టర్ వ్యక్తిత్వం గురించి లేడి కొరియోగ్రాఫర్ కస్తూరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు..
జానీ మాస్టర్ లో గుణం ఉంది…!
ఆ ఇంటర్వ్యూలో కొరియోగ్రాఫర్ కస్తూరి మాట్లాడుతూ.. అమ్మాయి ఏమి రెచ్చగొట్టకుండా అబ్బాయి తప్పు చేస్తాడు అంటే ఎవరు నమ్మరు.. జానీ మాస్టర్ విషయంలో కూడా అదే జరిగింది. డాన్స్ చేస్తున్న సమయంలో టచింగ్స్ జరిగినప్పుడు ఏదో అనుకోకుండా అలా జరిగింది. అయితే ఆ అమ్మాయి కంప్లీట్ గా జానీ మాస్టర్ ని తన కంట్రోల్లోకి తీసుకుంది.. జానీ మాస్టర్ ఫోన్ కూడా ఆమె హ్యాండిల్ చేస్తూ ఉండేది. కొన్ని సందర్భాల్లో జానీ మాస్టర్ భార్య షూటింగ్లో దగ్గరకు వచ్చినప్పుడు అది చూసి అసూయపడేది. మాస్టర్ తో తర్వాత కొంచెం కోపంగా మాట్లాడుతూ ఆయనను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆశపడింది. ఆ విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ అమ్మాయిని ఆరోజు దూరం పెట్టింటే ఇప్పుడు ఇంతవరకు వచ్చేది కాదు ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చేది కాదు అని కస్తూరి మాస్టర్ అన్నారు. ప్రస్తుతం మా అమ్మాయి మతం మారి ఆయనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో క్లారిటీ అయితే రాలేదు క్లారిటీ వస్తే కచ్చితంగా నేనే మరో ఇంటర్వ్యూలో చెప్తానని కస్తూరి మాస్టర్ తెలిపారు. మాస్టర్ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇక దీనిపై శ్రేష్ట వర్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..