OTT Movie : ఫాంటసీ సినిమాలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలు ఊహకి అందని విజువల్స్ తో ఆకట్టుకుంటాయి. పిల్లలతో సహా ఫ్యామిలీ మొత్తం చూడగలిగే విధంగా ఫాంటసీ సినిమాలు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో 3000 సంవత్సరాల క్రితం ఒక రాజును, మంత్రగాడు గాజు సీసాలో బంధిస్తాడు. ఒకవేళ అతడు బయటికి వస్తే, ఎవరైనా మూడు కోరికలు కోరాలి, అలా కోరుకోకపోతే మళ్లీ అతడు గాజు సీసాలోకి వెళ్ళిపోతాడు. డిఫరెంట్ కథతో వచ్చిన ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ ఫాంటసీ మూవీ పేరు ‘త్రీ థౌజండ్ ఇయర్స్ ఆఫ్ లాంగింగ్’ (Three thousand years of longing). 2022 లో వచ్చిన ఈ రొమాంటిక్ ఫాంటసీ డ్రామా మూవీకి జార్జ్ మిల్లర్ దర్శకత్వం వహించి, నిర్మించారు. ఈ మూవీని మిల్లర్ తన తల్లి ఏంజెలాకు అంకితం చేశారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
అలిత ఒక కాన్ఫరెన్స్ ఇవ్వడానికి అమెరికా నుంచి ఇస్తాంబుల్ కు వెళుతూ ఉంటుంది. ఎయిర్ పోర్ట్ లో ఆమెకు ఒక చిన్న మరుగుజ్జు వ్యక్తి కనపడి ఏదేదో చెప్తుంటాడు. ఆ తర్వాత అతడు కనిపించకుండా పోతాడు. అలిత కాన్ఫరెన్స్ ఇస్తుండగా, ఒక పొడవైన వ్యక్తి ఆమెపై దూసుకు వస్తూ ఉంటాడు. ఆ తర్వాత అతను కూడా కనిపించకుండా పోతాడు. ఇదంతా ఆమె ఇమేజినేషన్ చేసుకుంటూ ఉంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు, చనిపోవడంతో ఆమెకు సైకలాజికల్ ప్రాబ్లం వస్తుంది. ఒంటరిగా ఉండటంతో పక్కన ఎవరినో ఊహించుకుని మాట్లాడుతూ ఉంటుంది. ఈ సమస్య తగ్గినా, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అలా వెళ్తున్న క్రమంలో అలిత మార్కెట్లో ఒక వస్తువును కొంటుంది. అది డిఫరెంట్ గా ఉండటంతో దానిని తీసుకుంటుంది. తన రూమ్ కి వచ్చి దానిని శుభ్రం చేస్తూ ఉంటుంది. అయితే ఆ వస్తువు ఓపెన్ అయిపోతుంది.
అందులో నుంచి ఒక పదార్థం బయటకు వస్తుంది. అప్పుడే పెద్ద ఆకారంలో ఉండే ఒక వ్యక్తి ఆమెకు కనపడతాడు. అతన్ని చూసి ఆమె భయపడదు. ఎందుకంటే ఇటువంటి ఇమేజినేషన్ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటుంది. అందులో నుంచి విడుదల చేసినందుకు, అతను మూడు కోరికలు కోరుకోమంటాడు. నాకు ఏ కోరికలు లేవు అని అతనితో చెప్తుంది అలిత. అతడు కోపంతో ఊగిపోతాడు. అతను తన గతం చెప్పడం మొదలుపెడతాడు. 3000 సంవత్సరాల క్రితం తనని ఒక మాంత్రికుడు బంధించాడని చెప్తాడు. ఆ మాంత్రికుడు తన కజిన్ ని వశపరచుకోవడానికి ప్రయత్నించాడని, నేను అడ్డుగా ఉన్నందున నన్ను ఇలా చేశాడని చెప్తాడు. చాలా కాలం ఇందులో ఉన్నందున, శాప విముక్తి కలిగించాలని కోరతాడు. చివరికి అతని నుంచి అలిత మూడు కోరికలు కోరుతుందా? ఆ భూతం చేతిలో అలిత బలవుతుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని చూడండి.