E-Paper
Advertisement

Director: ప్రసాదంలో గర్భ నిరోధక మాత్రలు కలుపుతున్నారు..

Director: ప్రసాదంలో గర్భ నిరోధక మాత్రలు కలుపుతున్నారు..
Advertisement

Director:   తిరుపతి లడ్డూ వివాదం  రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న విషయం  తెల్సిందే.  ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని  తెలియడంతో అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీని వెనుక ఉన్నది ఎవరో కనిపెట్టాలని ఏపీ సీఎం సిట్ కు బాధ్యతలను అప్పగించిన విషయం  కూడా విదితమే. ఇక తిరుపతి లడ్డూ వివాదంపై   ప్రముఖులు కూడా తమ మద్దతును తెలుపుతున్నారు.  దీనిపై సోషల్ మీడియా లో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకొస్తున్నారు.

కొంతమంది టీడీపీదే తప్పు అంటుంటే.. ఇంకొంతమంది వైసీపీది అని  చెప్పుకొస్తున్నారు.  ఇంకొంతమంది అసలు ఇదేమి పట్టనట్టు ఉండిపోయారు. అయితే  తాజాగా తమిళ్ డైరెక్టర్  ఒకరు.. తిరుపతి లడ్డూ వివాదం  గురించి మాట్లాడుతూ తమిళనాడు ప్రసాదం గురించి తప్పుగా మాట్లాడడం మరింత సెన్సేషన్ సృష్టిస్తోంది.  తమిళ్ డైరెక్టర్ జి. మోహన్  ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ” మనకు తెలిసిన గుడిలో ప్రసాదంగా ఇచ్చే పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలుపుతారని విన్నాను” అంటూ మాట్లాడాడు.

Advertisement

తమిళనాడులోని పళని అరుల్మికు తాండాయుతపాణి ఆలయంలో నిర్మిస్తున్న పంజామృతం ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  అందులో ఇలాంటివి కలుపుతున్నారని ఆరోపణలు   రావడంతో తమిళనాడు షాక్ కు గురైంది.  పళని ప్రసాదం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తమిళనాడు పోలీసులు మోహన్ ను నేడు అరెస్ట్ చేశారు. చెన్నై రాయపురంలోని అతని నివాసానికి వెళ్లి మరీ అరెస్ట్ చేయడం గమనార్హం.

ఇక ఈ వివాదంపై తమిళనాడు హిందూ మత, ధర్మాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు మాట్లాడుతూ పళని ఆలయ పంచామృతం గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  జి మోహన్ .. ద్రౌపతి , రుద్రతాండవం, బగాసురన్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.  మరి ఈ కేసు వై ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×