BigTV English

Tamil Hero Madhavan: తెలంగాణ యాప్ ప్రచారం కోసం రంగంలో దిగిన తమిళ నటుడు మాధవన్

Tamil Hero Madhavan: తెలంగాణ యాప్ ప్రచారం కోసం రంగంలో దిగిన తమిళ నటుడు మాధవన్

Tamil Hero Madhavan promotes T.safe app for the security of women: లవర్ బాయ్ గా సినిమా రంగంలో ప్రవేశించాడు హీరో మాధవన్. అంతా అతనిని ముద్దుగా మ్యాడీ అని పిలుచుకుంటారు. తెలుగులో మణిరత్నం మూవీ సఖీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆ మూవీలో షాలినితో జతకట్టిన మాధవన్ ఎక్కువగా తమిళ చిత్రాలు చేశాడు. బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ చేసిన మాధవన్ లో మరో యాంగిల్ కూడా ఉంది. అతను గోల్ఫ్ క్రీడాకారుడు. ఏ కొద్దిగా విరామం దొరికినా గోల్ఫ్ ఆడుతుంటాడు. బైక్ రైడింగ్ అంటే ప్రాణం. మాధవన్ కు సొంతంగా జెట్ ఫ్లయిట్, షిప్ కూడా ఉంది.కాగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం ఓ టీ. సేఫ్ యాప్ ను లాంచ్ చేసింది. దాని ప్రచారకర్తగా మాధవన్ తన ట్విట్టర్ ఎకౌంట్ లో ప్రచారం నిర్వహించాడు.


ఈ యాప్ ఉంటే మహిళలు సేఫ్

చాలా చోట్లకు ఒక్కోసారి మహిళలు ఒంటరి ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఒక్కోసారి నైట్ డ్యూటీ అయ్యాక క్యాబ్ బుక్ చేసుకుని కూడా ఒంటరిగా ప్రయాణిస్తుంటారు. అలాగే ఎక్కడో పల్లె ప్రాంతాలనుంచి చదువులు, ఉద్యోగాల కోసం ఒంటరిగా రూమ్స్ తీసుకుని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో వీరిపై దుండగులు ఎవరైనా ఎటాక్ చేసినా, లైంగిక వేధింపులకు గురిచేసినా వారి భద్రత కోసమే ప్రత్యేకంగా తెలంగాణ సర్కార్ ఓ యాప్ ను రూపొందించింది. అదే టీ సేఫ్ యాప్. ఈ యాప్ ఎవరైనా ఒంటరి మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు గుర్తించి సమీపంలో ఉన్న పోలీసులకు సమాచారం చేరవేస్తుంది. సమాచారంలో ఉండే సిగ్నల్స్ ఆధారంగా ప్రమాదంలో ఉన్న మహిళలను రక్షించేందుకు పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుంటారు. గతంలోనూ ఈ తరహా యాప్ లు ఉన్నప్పటికీ టీసేఫ్ యాప్ అత్యాధునిక సాంకేతికతతో నడుస్తుంది.


కోల్ కతా ఘటనతో అప్రమత్తం

ఇటీవల కోల్ కత్తా నగరంలో మహిళా వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య నేపథ్యంలో ఈ టీ సేఫ్ యాప్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ టీసేఫ్ యాప్ అత్యంత ఉపయోగకరంగా ఉండటంతో దాదాపు ఏడు రాష్ట్రాలు ముందుకొచ్చాయి వీటిని తమ రాష్ట్రంలో అమలుచేసేందుకు. అయితే ఈ యాప్ గురించి మాధవన్ తన ట్విట్టర్ అకౌంట్ లో ప్రచారం చేశాడు. మహిళలు, కాలేజీ లకు వెళ్లే ఆడపిల్లలు తప్పనిసరిగా ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని చెబుతూ దీనిపై అవగాహన కల్పిస్తున్నారు హీరో మధవన్. నేటి ఆధునిక సమాజంలో నేర ప్రవృత్తి ఎంతగానో పెరిగిపోయిందని..నేరస్తులు తెలివిగా ఒంటరి మహిళలను ట్రాప్ చేస్తున్నారని అలాంటప్పుడు ఎవరిని సంప్రదించాలో తెలియక ప్రమాదంలో పడే మహిళలకు ఈ యాప్ వారికి అండగా ఉంటుందని..ఇలాంటి యాప్ ను ప్రమోట్ చేయడం తనకి ఎంతో గర్వకారణంగా ఉందని మాధవన్ అన్నారు.

మంత్రి సీతక్క అభినందనలు

మాధవన్ లాంటి హీరో టీసేఫ్ యాప్ ను ప్రచారం చేయడంతో ఈ యాప్ కు మరింత గుర్తింపు లభించిందని తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేకంగా హీరో మాధవన్ కు అభినందనలు తెలిపారు. తెలంగాణలో ఈ యాప్ గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు ఆదేశాలు పంపారు. ప్రతి ఒక్క మహిళా ఈ యాప్ వినియోగించడం ద్వారా తమను తాము రక్షించుకోగలుగుతారని మంత్రి సీతక్క తెలిపారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×