BigTV English

Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే.. అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే.. అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Megastar Chiranjeevi Movie Vishwambhara Teaser Update: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా..త్రిష కృష్ణణ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో మీనాక్షి చౌదరి, అషికా రంగానథ్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా, నేడు ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ‘విశ్వంభర’ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. కానీ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సినిమా డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.


సోషల్ మీడియాలో చాలా పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి. గురువారం టీజర్ రిలీజ్ అవుతుందని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే విశ్వంభర సినిమా టీజర్ రిలీజ్ చేస్తారనే ప్రచారాన్ని డైరెక్టర్ వశిష్ట కొట్టిపారేశారు. తాము ప్లాన్ ప్రకారం సినిమాను ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. చిరంజీవి బర్త్ డే సందర్బంగా గురువారం టీజర్ రావట్లేదని చెప్పారు. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తామన్నారు. ఇక, ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అంతకుముందు డైరెక్టర్ వశిష్ట పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘చిన్నపటినుంచి చిరంజీవి అభిమానిని. అతడి మ్యానరిజాన్ని అనుకరించేవాడిని. రామ్ చరణ్, అల్లు శిరీష్ ల పరిచయంతో ఇంటికి వెళ్లి ఆయనను దగ్గరుండి చూసేవాడిని. ప్రతిరోజు ఆయన కొత్తగా కనిపించేవారు. ఆయనతో ప్రస్తుతం సినిమా తీయడం సంతోషంగా ఉంది. ఆయన ప్రతి ఒక్కరి సలహా వింటారు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు.’ అని చెప్పుకొచ్చారు.


Also Read:  నా ఫ్రెండ్స్ కోసం నేను వస్తా.. రాజకీయ పర్యటనపై అల్లు అర్జున్ క్లారిటీ

ఇక సినిమా విషయానికొస్తే.. చిరంజీవి అభిమానులు ఎలా ఉండాలో అన్ని అంశాలు విశ్వంభర సినిమాలు ఉంటాయన్నారు. ఈ సినిమాలో మళ్లీ మనందరికీ పాత చిరంజీవి గుర్తుకొస్తారన్నారు. చాలా కాన్పిడెంట్ గా చెబుతున్నా..ఈ మూవీ హిట్ అవుతుందని చెప్పారు.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×