BigTV English

Tarakaratna: ఎట్టకేలకు శుభవార్త చెప్పిన అలేఖ్య రెడ్డి.. ఫొటోస్ వైరల్..!

Tarakaratna: ఎట్టకేలకు శుభవార్త చెప్పిన అలేఖ్య రెడ్డి.. ఫొటోస్ వైరల్..!

Tarakaratna.. నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna).. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన 2001లో ఒకేసారి 9 సినిమాలకు సంతకం చేసి వరల్డ్ రికార్డు సృష్టించారు. 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై..దాదాపు చాలా చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. చివరిగా 2022లో ఎస్ 5 నో ఎగ్జిట్ అనే సినిమాలో కనిపించిన ఈయన నైన్ అవర్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా అదే ఏడాది చివరిగా నటించారు.


లోకేష్ యువగళం పాదయాత్రలో తుది శ్వాస విడిచిన తారకరత్న..

ఆ తర్వాత 2023 జనవరి 27వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత మినిస్టర్ నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభించగా.. అందులో తారకరత్న రాజకీయంగా తొలి అడుగు వే, సి ఆ పాదయాత్రలో పాల్గొన్న ఈయన అదే రోజే కళ్ళు తిరిగి పడిపోవడంతో వెంటనే దగ్గర్లోని కేసీ ఆసుపత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఎస్ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించగా.. వైద్య పరీక్షల్లో ఆయన గుండెలో ఎడమవైపు 90% బ్లాక్ అయిందని వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు తరలించగా దాదాపు 22 రోజులపాటు మృత్యువుతో పోరాడి 2023 ఫిబ్రవరి 18న తొలి శ్వాస విడిచారు. ఆయన మరణం ఆయన భార్య పిల్లలను ఒంటరిని చేసిందని చెప్పవచ్చు.


శుభవార్త తెలిపిన తారకరత్న భార్య..

తారకరత్న మరణం తర్వాత కుటుంబానికి అన్నీ తానై ముందుకు వెళ్తోంది అలేఖ్య రెడ్డి (Alekhya reddy). సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తారకరత్నను తలుచుకుంటూ పలు పోస్ట్లు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉండే ఈమె ఈ మధ్యకాలంలో తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తోంది.. ఇక ఎవరైనా తనని ఏదైనా అంటే గట్టిగా సమాధానం కూడా ఇస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా అలేఖ్య రెడ్డి తన ఇన్స్టా వేదికగా శుభవార్త తెలిపి తారకరత్న అభిమానులను ఖుషీ చేసింది.

ఘనంగా పెద్ద కూతురు నిష్కా హాఫ్ సారీ ఫంక్షన్..

అలేఖ్య రెడ్డి ఈరోజు తన పెద్ద కూతురు నిష్క హాఫ్ సారీ ఫంక్షన్ జరిగిందంటూ ఆ ఫోటోలు , వీడియోలు కూడా షేర్ చేసింది. ముఖ్యంగా ఈ ఫంక్షన్ లో తారకరత్న ఫోటో పెట్టి ఆయనకు నివాళులు కూడా అర్పించి, ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా ప్రారంభించినట్లు ఆ వీడియోలు షేర్ చేసింది అలేఖ్య రెడ్డి. నిష్క (Nishka ) పుష్పవతి కావడంతో పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి అలేఖ్యరెడ్డి పెదనాన్న వైసీపీ నేత విజయసాయిరెడ్డి (Vijay Sai Reddy) తో పాటు పలువురు బంధుమిత్రులు పాల్గొన్నారు.

ఫంక్షన్ కి దూరంగా నందమూరి కుటుంబం..

ఇకపోతే ఇంత గ్రాండ్ గా ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగా నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కరు కూడా కనిపించకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిష్క హాఫ్ శారీ ఫంక్షన్ కి నందమూరి కుటుంబ సభ్యులను అలేఖ్య రెడ్డి పిలవలేదా? ఒకవేళ పిలిచిన వారు రాలేదా? అనే అనుమానాలు నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తండ్రి లేని పిల్లలు కాబట్టి ఖచ్చితంగా నందమూరి కుటుంబ సభ్యులు ఆదరించాలని నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే నిష్క హాఫ్ సారీ ఫంక్షన్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×