Tejeswi Madivada: టాలీవుడ్ యంగ్ బ్యూటీ తేజెస్వి మదివాడ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఒక్కో సినిమా తన టాలెంట్ తో నిరూపించుకుంది. తన క్రేజ్ తో సినిమాలు చేస్తూనే మరోవైపు పలు షోల్లోనూ మెరుస్తూ సందడి చేస్తుంది. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. తేజస్వి మదివాడ నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 తో ప్రేక్షకులను అలరించింది. అయితే ఆ తర్వాత బిజీ అవుతుందని అనుకున్నారు. కానీ వరుస షోలతో బిజీ అవుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారు మతి పోగొడుతుంది.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజు బోల్డ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అలాంటి వాళ్లు నాకు కావలి..
తేజశ్రీ మదివాడ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ముఖ్యంగా తన కెరియర్ లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న విషయాల గురించి షేర్ చేసింది.. అయితే తేజస్వి అంటే బోల్డ్ అని అందరు అనుకుంటారు. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ రూమర్స్ మాత్రం ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే తేజస్వికి ఎలాంటి వ్యక్తితో డేట్ చేయాలనిపిస్తుంది అని యాంకర్ అడిగారు. వారం రోజులు పది రోజులు టైంపాస్ చేసే వాడితో కాదు లైఫ్ లాంగ్ మనసులు పెట్టుకుని చూసుకునే వాడితోనే ఇక మీదట డేట్ చేస్తానని తన మనసులోని మాటని బయటకు చెప్పింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో ఆమెపై నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read :మంచు విష్ణు, మోహన్ బాబుకు బిగ్ షాక్.. హైకోర్టు నోటీసులు..
తేజెస్వి సినిమాల విషయానికొస్తే..
బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తనకు చాలా క్రేజ్ దక్కిన మాట నిజమే అయినప్పటికీ.. తనకు కాస్త నెగటివ్ రెస్పాన్స్ వచ్చిందని అభిప్రాయపడింది. ఆ షో నుంచి బయటికి వచ్చాక తన బాయ్ ఫ్రెండ్ తనను వదిలి వెళ్లాడని బాధపడింది.. తన పై నెగిటివ్ ప్రచారం జరిగిందని బాధ పడింది. పలు ఇంటర్వ్యూలకు వెళ్ళింది. అక్కడ క్లారిటీ ఇచ్చింది. ఇక ఇండస్ట్రీ లో ఒక మహిళ నిలదొక్కుకోవాలంటే చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, అది అంత ఈజీ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది.. ఈ మధ్య బుల్లితెర పై ప్రసారం అవుతున్న పలు షోలకు హోస్ట్ గా చేస్తుంది. కాకమ్మ కథలు సీజన్ 2 షోలో హోస్ట్ గా చేస్తుంది.. బుల్లితెరపై ప్రసారమవుతున్న పలుశోలలో సందడి చేస్తూ వస్తుంది. అయితే ఈమధ్య సినిమాలైతే చేయలేదు కానీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోగొడుతుంది.. ఈమె ఫోటోలు ఎంత హాట్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..