BigTV English

Samantha: నాగచైతన్యను జన్మలో కలవను.. ఏ ఈవెంట్ కు రాను ?

Samantha: నాగచైతన్యను జన్మలో కలవను.. ఏ ఈవెంట్ కు రాను ?

Samantha: స్టార్ హీరోయిన్ సమంత- అక్కినేని నాగచైతన్య మళ్లీ కలవబోతున్నారు అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అదేంటి రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్న ఈ జంట మళ్లీ ఎందుకు కలుస్తున్నారు..? నిజంగా ఇది జరుగుతుందా..? అని చాలామందికి అనుమానం వచ్చింది.  అయితే అసలు ఎందుకు వీళ్ళు కలుస్తున్నారు..? అనే విషయం గురించి మాట్లాడితే.. ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. కొత్త సినిమాల కన్నా రీరిలీజ్ సినిమాలే ఎక్కువగా హైప్ తెచ్చుకుంటున్నాయి. దీంతో మేకర్స్ గతంలో బాగా హిట్ అయిన సినిమాలను రీరిలీజ్ చేస్తూ, వాటికి దగ్గరుండి ప్రమోషన్స్ చేయిస్తూ, మరింత హైప్  క్రియేట్ చేయిస్తూ, రికార్డు కలెక్షన్స్  రాబడుతున్నారు.


 

ఈ మధ్యనే అందాల రాక్షసి సినిమా రీరిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు అందులో నటించిన  రాహుల్ రవీంద్రన్, నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి ప్రమోషన్స్ కూడా చేసిన విషయం విదితమే. ఇక ఈ సినిమా తర్వాత మరో లవ్ స్టోరీ రీరిలీజ్ కు రెడీ అవుతుంది. అదే ఏ మాయ చేసావే. అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 15 ఏళ్ల క్రితం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా సెట్ లోనే చై- సామ్  పరిచయం.. ప్రణయంగా మారి పరిణయంకి దారితీసింది. ఆ తర్వాత ఈ జంట కలకాలం కలిసి ఉంటారని అభిమానులు ఎంతో ఆశించారు. కానీ, నాలుగేళ్లు కూడా కలిసి ఉండకుండా ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు.


 

విడాకుల అనంతరం ఎవరిదారి వారు చూసుకున్న  చైతన్య -సమంత ఇప్పటివరకు ముఖముఖాలు కూడా చూసుకోలేదు. ఇప్పుడు మళ్లీ ఏ మాయ చేసావే రీరిలీజ్ ప్రమోషన్స్ లో కలవబోతున్నారని వార్తలు రావడంతో అభిమానులు ఆనందంతో గెంతులు వేశారు. జూలై 18న ఏ మాయ చేసావే  రీరిలీజ్ కానుంది. దీంతో ఈ మధ్యలోనే చై- సామ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ వార్తలపై సమంత స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. అసలు ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో తెలియడం లేదని చెప్పుకొచ్చింది.

Vijay-Rashmika: కారులో అడ్డంగా దొరికిపోయిన ప్రేమ జంట.. కెమెరాలకు చిక్కకుండా ?

 

“ఏ మాయ చేసావే సినిమా టీమ్ తో కలిసి నేను ప్రమోషన్స్ చేస్తున్నాను అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను ఆ సినిమాను ప్రమోట్ చేయడం లేదు. నిజం చెప్పాలంటే నేను ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నాను. ఇలాంటి వార్తల ఎవరు కల్పిస్తున్నారో నాకు తెలియడం లేదు. అప్పుడు సినిమాలో నటించిన నటీనటులందరూ ఇప్పుడు మళ్లీ కలవాలని అభిమానులు కోరుకోవడంలో తప్పులేదు. తమ అభిమాన నటీనటులు మళ్లీ కలవాలని వారు అనుకోవచ్చు. కానీ,  ప్రేక్షకుల దృష్టి కోణం పై ఒకరి జీవితం ఆధారపడి ఉండదు “అని చెప్పుకొచ్చింది.

 

అయితే తాను నటించిన మొదటి సినిమా మాస్కోవేన్ కావేరి షూటింగ్ విషయాలు తనకేమీ గుర్తులేకపోయినా.. ఆ తరువాత  నటించిన ఏ మాయ చేసావే సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని మర్చిపోలేనని అని చెప్పుకొచ్చింది. కార్తీక్ ఇంటి గేటు వద్ద జెస్సీ- కార్తీక్ మాట్లాడుకునేది తన మొదటి షాట్ అని తెలిపింది.  కెరీర్ ఆరంభంలోనే గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి డైరెక్టర్ తో కలిసి పని చేస అవకాశం రావడం తనకు ఎంతో సంతోషంగా అనిపించిందని సమంత తెలిపింది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. అదేంటి సమంత అంత మాట అనేసింది ఆమె ప్రమోషన్స్ కి వస్తుందని తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, ఇప్పుడు సామ్ రావడం లేదు అని చెప్పి మనస్సును ముక్కలు చేసిందని కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×