BigTV English

Chiranjeevi : చివరికి డ్రిల్ మాస్టర్‌గా మారిపోయాడు… అనిల్ అసలేం చేస్తున్నావయ్యా ?

Chiranjeevi : చివరికి డ్రిల్ మాస్టర్‌గా మారిపోయాడు… అనిల్ అసలేం చేస్తున్నావయ్యా ?

Chiranjeevi :మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. సీనియర్ హీరో అయినప్పటికీ వరుసగా యంగ్ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ సత్తా చాటాలని చూస్తున్నారు. ఇకపోతే చిరంజీవి కథలు ఎంపిక విషయంలో మునుపటి టాలెంట్ ఏమైందో తెలియదు. కానీ ఇప్పుడు వరుసగా డిజాస్టర్లు చవిచూస్తున్నారని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరిగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సక్సెస్ అందుకున్న చిరంజీవి.. ఇప్పుడు ‘విశ్వంభర’ సినిమాను సెట్ లో ఉంచిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి బరిలోనే నిలవాల్సిన ఈ సినిమా.. ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. దీనికి తోడు ఇప్పుడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో ‘మెగా 157’ మూవీ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది.


మెగా 157 మూవీ నుంచీ క్రేజీ అప్డేట్..

ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపబోతున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మెగా 157 సినిమాలో చిరంజీవి డ్రిల్ మాస్టర్ శివ శంకర్ ప్రసాద్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో చివరికి మెగాస్టార్ డ్రిల్ మాస్టర్ గా మారిపోయారా?.. అనిల్ ఏం ప్లాన్ చేశావయ్యా? అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి మెగాస్టార్ అయిన చిరంజీవి ఈ సినిమాలో డ్రిల్ మాస్టర్ గా ఎలా మెప్పించబోతున్నారో చూడాలి.


ఈ సినిమా షూటింగ్ అప్డేట్ విషయానికి వస్తే..

ప్ర‌స్తుతం ముస్సోరిలో ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి డ్రిల్ మాస్టర్ కావడంతో స్కూల్ నేప‌థ్యంలో కొన్ని స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు. సెట్లో చిరంజీవితో పాటు నయనతార (Nayanthara), కేథరిన్ (Catherine tresa)కూడా ఉన్నారు. అంతేకాదు ఇక్కడే హీరో , హీరోయిన్ల మధ్య ఒక అందమైన రొమాంటిక్ సాంగ్ ని కూడా చిత్రీకరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

జోరు పెంచిన అనిల్ రావిపూడి..

అనిల్ రావిపూడి ఈ ఏడాది వెంకటేష్ (Venkatesh)తో ‘ సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఒక్క ప్రాంతీయంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడు అదే జోష్ మీద మెగా 157 కథ కూడా రాసుకున్నారు అనిల్ రావిపూడి. అందుకు తగ్గట్టుగానే గతంలో చిరంజీవికి చెల్లెలుగా చేసిన నయనతారను ఇందులో హీరోయిన్ గా పెట్టారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సాధారణంగా సినిమా ప్రమోషన్స్ కి రాని నయనతార చేత ఇంట్రడక్షన్ ప్రమోషన్ వీడియో కూడా చేయించారు. అంతేకాదు నయనతార ఈ సినిమా కోసం ఏకంగా సగానికి సగం తన రెమ్యూనరేషన్ ని కూడా తగ్గించుకుంది. ఇలా మొత్తానికైతే సినిమా కోసం పక్కాగా ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి.. ఈ సినిమాతో ప్యూర్ కామెడీ తెరపై చూపించి, మరో సక్సెస్ అందుకోబోతున్నట్లు సమాచారం.

ALSO READ:Akhil Akkineni : అప్పుడు సచిన్ సక్సెస్ అయ్యాడు… మరి ఇప్పుడు అయ్యగారి పరిస్థితేంటో ?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×