Tabu: టబు.. కూలీ నెంబర్ 1 అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ భామ నిన్నే పెళ్లాడతా సినిమాలో నాగార్జున సరసన నటించి.. తెలుగువారికి పండుగా మారిపోయింది. గ్రీకువీరుడు.. నా రాకుమారుడు అంటూ ఆ సినిమాలో వరుడు కోసం పాడిన ఈ చిన్నది.. రియల్ గా తన జీవితంలో ఆ సాంగ్ ను పాడలేకపోయింది. 52 ఏళ్ళు వచ్చినా టబు ఇంకా పెళ్లి చేసుకోలేదు. దానికి కారణం నాగార్జున అని కొందరు చెప్తుంటారు.
టబు, నాగార్జునను ప్రేమించింది అని, కానీ.. ఆయనకు పెళ్లి కావడంతో ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుందని టాక్. ఇక బాలీవుడ్ లో కూడా ఆమెపై అనేక రూమర్స్ ఉన్నాయి. అజయ్ దేవగణ్ తో కూడా ఆమె ఎఫైర్ నడిపిందని వార్తలు వచ్చాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఒక ఇంటర్వ్యూలో టబు.. పెళ్లి గురించి, పిల్లల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం లేదని, కానీ తల్లిని మాత్రం అవుతాను అని చెప్పింది.
పిల్లలు కనడానికి పెళ్లి అవసరం లేదని , సరోగసీ ద్వారా కూడా తల్లి కావచ్చు అని ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనాన్ని సృష్టించాయి. ఇక ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న టబు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. టబు ఒక స్టార్ హీరోను వివాహమాడనుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఆ హీరో ఆమె కన్నా చిన్నవాడట. బాలీవుడ్ లో మంచి సినిమాల్లోనే నటించాడట.
ప్రస్తుతం వీరు డేటింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు కుటుంబాలు మాట్లాడుకున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. ఇక టబు ఫ్యాన్స్ మాత్రం అందులో కచ్చితంగా నిజం లేదు. టబు పెళ్ళికి దూరంగా ఉంటుంది. ఇలాంటి రూమర్స్ ఆమె జీవితంలో చాలా కామన్ అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే టబు స్పందించక తప్పదు.