BigTV English
Advertisement

Nandamuri Bala Krishna: బాలయ్య ‘ఆవేశం’.. 20 ఏళ్ల రూల్ కు బ్రేక్

Nandamuri Bala Krishna: బాలయ్య ‘ఆవేశం’.. 20 ఏళ్ల రూల్ కు బ్రేక్

Nandamuri Bala Krishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ సినిమాతో బిజీగా ఉన్నాడు. NBK109 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాధ్ నటిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య – బోయపాటి సినిమా అఖండ 2 మొదలు కానుంది.


ఇవి కాకుండా బాలయ్య చాలాకాలం తరువాత ఒక రీమేక్ సినిమాను ఓకే చేసాడని టాక్ నడుస్తోంది. ఈ ఏడాది మలయాళ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏ రేంజ్ లో హిట్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా హిట్ అయినా సినిమాల లిస్ట్ లో ఆవేశం ఒకటి. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి జీతూ మాధవన్ దర్శకత్వం వహించాడు.

ఏప్రిల్ 11 న రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడమే కాకుండా వంద కోట్ల క్లబ్ లో కూడా చేరింది. ఇక ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలనీ అప్పట్లో ప్లాన్ చేశారు కానీ, ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆవేశం తెలుగు రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఇక ఇందులో ఫహద్ పాత్రలో బాలయ్య నటిస్తున్నాడట. కథ నచ్చడంతో బాలయ్య ఈ రీమేక్ ను ఓకే చేసినట్లు తెలుస్తోంది.


దాదాపు 20 ఏళ్ళ క్రితం కోలీవుడ్ లో హిట్ అయిన సామి సినిమాను లక్ష్మీ నరసింహా పేరుతో రీమేక్ చేసిన బాలయ్య.. ఆ తరువాత ఇప్పటివరకు మళ్లీ రీమేక్ జోలికి పోలేదు. ఇక ఇప్పుడు 20 ఏళ్ల తరువాత ఆవేశం కోసం ఆ రూల్ ను బ్రేక్ చేస్తున్నాడు. ఒకవిధంగా చెప్పాలంటే ఆవేశం కథ బాలయ్యకు చక్కగా సరిపోతుంది. ఫహద్ నటనకు ఎలాంటి మంచి గుర్తింపు వచ్చిందో తెలుగులో బాలయ్య చేస్తే అంతకుమించిన గుర్తింపు వస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అంటున్నారు అభిమానులు. మరి ఈ రీమేక్ కథను నిర్మించేది ఎవరు.. ? దర్శకత్వం వహించేది ఎవరు.. ? అని తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×