BigTV English

The Raja Saab: జపాన్‌లో ఆడియో లాంచ్, ముగ్గురు హీరోయిన్స్‌తో స్పెషల్ సాంగ్.. ‘రాజా సాబ్’ ప్లానింగ్ బయటపడిందిగా.!

The Raja Saab: జపాన్‌లో ఆడియో లాంచ్, ముగ్గురు హీరోయిన్స్‌తో స్పెషల్ సాంగ్.. ‘రాజా సాబ్’ ప్లానింగ్ బయటపడిందిగా.!

The Raja Saab: హీరోల సినిమాల విషయంలో ఎక్కువగా గ్యాప్ వచ్చిందంటే చాలు.. వాళ్ల అప్‌కమింగ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా పాన్ ఇండియా హీరోల మూవీ అప్డేట్స్ కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అదే కేటగిరిలో ఉన్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న అప్‌కమింగ్ మూవీ ‘రాజా సాబ్’పై మొదట్లో ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. అలాంటిది కొన్ని పోస్టర్లు విడుదల అవ్వగానే దీనిపై బజ్ మామూలుగా క్రియేట్ అవ్వలేదు. ఆ తర్వాత ‘రాజా సాబ్’ నుండి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేయడానికి తమన్ వచ్చేశాడు.


అంచనాలు పెంచేలా

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ (Raja Saab) ఏ మాత్రం అంచనాలు లేకుండా మొదలయ్యింది. పైగా ఇప్పటివరకు ఒక్క స్టార్ హీరోను కూడా హ్యాండిల్ చేయలేని మారుతికి అసలు ఇంత పెద్ద బాధ్యత ప్రభాస్ ఎలా అప్పగించాడా అని అప్పట్లో సోషల్ మీడియాలో చాలా డిస్కషన్స్ కూడా నడిచాయి. కానీ ముందుగా ఒక గ్లింప్స్ విడుదల చేసి అందరి నోరు మూయించాడు మారుతి. అలా ‘రాజా సాబ్’పై ఇప్పుడు అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా తమన్ కూడా ఈ మూవీ గురించి ఇప్పటివరకు తెలియని విషయాలు బయటపెట్టి అంచనాలు మరింత పెంచేశాడు.


Also Read: ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.! ఇప్పటికీ రిచ్చే.!

ఫ్యాన్స్ కోసం

మారుతి (Maruthi), ప్రభాస్ (Prabhas) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’కు తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్.. ఈ మూవీలోని ప్రతీ పాటకు సంబంధించిన అప్డేట్‌ను అందించాడు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు ఫ్యాన్ బేస్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా జపాన్‌లో అయితే ప్రభాస్ పేరు చెప్తే గుర్తుపట్టనివారు ఉండరు అన్నట్టుగా ఉంది పరిస్థితి. అందుకే జపాన్‌లోనే ‘రాజా సాబ్’ ఆడియో లాంచ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలిపాడు తమన్. అంతే కాకుండా అక్కడి ఫ్యాన్స్ కోసం జపానీస్ వర్షన్‌లో ఒక పాట కూడా కంపోజ్ చేస్తున్నట్టు బయటపెట్టాడు. అంతే కాకుండా ఈ సినిమాలో ఎలాంటి పాటలు ఉంటాయో కూడా చెప్పుకొచ్చాడు.

పాటల అప్డేట్స్

‘రాజా సాబ్’లో ఒక మాస్ పాట కూడా ఉండబోతుందని తమన్ హామీ ఇచ్చాడు. ‘‘చాలాకాలం తర్వాత ప్రభాస్ ఒక మాస్ సాంగ్‌తో రాబోతున్నాడు. ఈ సినిమాలో ఒక డ్యూయెట్ కూడా ఉండబోతుంది. దాంతో పాటు రాజా సాబ్ వరల్డ్ థీమ్ సాంగ్ ఉంటుంది. ఒక ఇంట్రడక్షన్ సాంగ్, ఒక ఐటెమ్ సాంగ్, సెకండ్ హాఫ్‌లో ముగ్గురు హీరోయిన్స్‌తో కలిసి ప్రభాస్ పాట కూడా ఒకటి ఉంటుంది’’ అని పూర్తిగా బయటపెట్టేశాడు తమన్ (Thaman). దీంతో చాలారోజులుగా ప్రభాస్‌ను పక్కా మాస్ యాంగిల్‌లో చూడాలని అనుకుంటున్న ప్రేక్షకులకు ‘రాజా సాబ్’ ఫీస్ట్ ఇస్తుందని ఫిక్స్ అయిపోతున్నారు. కేవలం పాటల అప్డేట్‌తోనే హైప్ ఎక్కించేశాడు తమన్.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×