Hero Tarun Net Worth: వరుసగా ఫ్లాపులు వచ్చినా కూడా వాటిని తట్టుకొని నిలబడే స్టార్లు కొందరే ఉంటారు. అలా చాలాకాలం ఎదురుచూసినా కూడా వారికి హిట్లు దక్కకపోవచ్చు. అలాంటి సమయంలో సినీ కెరీర్‌ను పక్కకు పెట్టి చాలామంది పక్కకు తప్పుకుంటారు. ఆ కేటగిరిలో ఇప్పటికే చాలామంది హీరో, హీరోయిన్లు చేరారు. అందులో తరుణ్ కూడా ఒకడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన తరుణ్.. చిన్నప్పుడే తన నటనతో అందరి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కొన్నేళ్లగా హీరో అయ్యాడు, లవర్ బాయ్ ఇమేజ్ దక్కించుకున్నాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నా కూడా ఈ లవర్ బాయ్‌కు ఇంకా రిచ్చే అని తన ఆస్తుల విలువ చూస్తే అర్థమవుతుంది.
ఆ రేంజ్ రెమ్యునరేషన్
సీనియర్ నటి అయిన రోజా రమని, ఒడియాలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుశాంత్ చక్రపాణి కుమారుడే తరుణ్. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కావడంతో తరుణ్ తాజాగా చిన్న వయసు నుండే యాక్టింగ్ మొదలుపెట్టాడు. తన యాక్టింగ్‌తో అప్పట్లోనే గుర్తింపు సంపాదించుకున్నాడు. చిన్నప్పుడే తన యాక్టింగ్‌తో నేషనల్ అవార్డ్ కూడా సంపాదించుకున్నాడు. హీరో అయిన తర్వాత కూడా తన యాక్టింగ్‌కు ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కాయి. అప్పట్లోనే లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న తరుణ్.. ఒక్క సినిమాకు రూ.1 కోటి రెమ్యునరేషన్ డిమాండ్ చేసేవాడని సమాచారం. తను నటించే చిత్రాలు మినిమమ్ గ్యారెంటీ హిట్లుగా నిలిచేవి కాబట్టి మేకర్స్ కూడా ఆ రెమ్యునరేషన్ ఇవ్వడానికి వెనకాడేవారు కాదట.
Also Read: ఆ ఒక్క సినిమా చేయకుండా ఉండాల్సింది.. రిగ్రెట్ అవుతున్న రామ్ చరణ్
సంపాదన, ఆస్తులు
2009 తర్వాత తరుణ్‌కు సినిమాల్లో అవకాశాలు చాలావరకు తగ్గిపోయాయి. అప్పుడప్పుడు అవకాశాలు వచ్చినా తాను నటించిన సినిమాలు హిట్లు అందుకోకపోవడంతో మేకర్స్ తనను పక్కన పెట్టేశారు. అప్పటికే ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న హీరోల వెంటపడ్డారు. అలా తరుణ్ మెల్లగా వెండితెరకు పూర్తిగా దూరమయ్యాడు. అయినా కూడా ఇప్పటికీ తరుణ్ ఆస్తుల విలువ దాదాపు రూ. 30 కోట్లు ఉంటుందని సమాచారం. ఇప్పటికీ తనకు ఉన్న బిజినెస్‌ల కారణంగా నెలకు దాదాపు రూ.30 లక్షలు సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. అలా ఏడాదికి ఎలా అయినా రూ.3.5 కోట్ల సంపాదనను వెనకేసుకుంటున్నాడట తరుణ్. ఇది విన్న ప్రేక్షకులు హీరోగా తను ఫామ్‌లో లేకపోయినా ఆస్తుల విలువ మాత్రం బాగానే ఉందని ఫీలవుతున్నారు.
కార్లు, బంగ్లాలు
తరుణ్ ఆస్తుల విషయానికొస్తే.. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఆదిత్య సమ్మిట్ అపార్ట్మెంట్స్‌లో నివాసముంటున్నాడు. ఆ ఫ్లాట్ తనదే. ఈ ఫ్లాట్ విలువ దాదాపు రూ.1.5 నుండి 2 బిలియన్ ఉంటుందని సమాచారం. తరుణ్ (Tarun) రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో కూడా పార్ట్నర్‌షిప్స్ ఉన్నాయని సమాచారం. ఇల్లుతో పాటు ఈ హీరో వద్ద పలు లగ్జరీ కార్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. టయోటా ఫార్చునర్, జాగ్వార్ ఎక్స్‌జే, వోల్క్స్‌వాగన్ పోలో జీటీ లాంటి హై ఎండ్ టాప్ కార్లు తరుణ్ సొంతం. ఎనిమిదేళ్లకే నటుడిగా తన కెరీర్‌ను మొదలుపెట్టిన తరుణ్.. ఆన్ స్క్రీన్ లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నా కూడా ఆఫ్ స్క్రీన్ మాత్రం తను ఇంకా సింగిలే.