BigTV English

Thaman : దసరాకి ‘గేమ్ ఛేంజర్’ టీజర్ కష్టమే… చెర్రీ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లిన తమన్

Thaman : దసరాకి ‘గేమ్ ఛేంజర్’ టీజర్ కష్టమే… చెర్రీ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లిన తమన్

Thaman : ఇటీవల కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తను సంగీతం అందిస్తున్న సినిమాలకు సంబంధించిన వరుస అప్డేట్స్ ఇస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘గేమ్ ఛేంజర్’ టీజర్ దసరాకు రాబోతోందని బోలెడన్ని ఆశలు పెట్టుకున్న మెగా ఫాన్స్ ను తన తాజా ట్వీట్ తో డిసప్పాయింట్ చేశారు. అసలు తమన్ ఇచ్చిన ఈ లేటెస్ట్ అప్డేట్ ఏంటో చూసేద్దాం పదండి.


దసరాకు ‘గేమ్ ఛేంజర్’ టీజర్ కష్టమే..

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పొలిటికల్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘గేమ్ ఛేంజర్’. విజనరీ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని ఇన్నాళ్లు అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశారు. సినిమా షూటింగ్ అయితే పూర్తయింది కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాలేదు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేసి సినిమాలోని రెండు పాటలను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అందులో రీసెంట్ గా ‘రా మచ్చా’ అంటూ సాగిన పాట సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఎలాగూ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు కాబట్టి దసరా ట్రీట్ గా చాలా రోజుల నుంచి ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల కోసం టీజర్ రిలీజ్ చేస్తారని వార్తలు వినిపించాయి. దీంతో అభిమానులు కూడా ఆసక్తిగా ఈ టీజర్ కోసం వెయిట్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తమన్ ముందుగానే టీజర్ రావట్లేదని హింట్ ఇచ్చారు.


‘దసరాకి టీజర్ రావట్లేదని డిసప్పాయింట్ అవ్వకండి అబ్బాయిలు.. సినిమాకు సంబంధించిన సిజి, విఎఫ్ఎక్స్ షార్ట్ ల ఫైనల్ ఎడిటింగ్ జరుగుతోంది. డబ్బింగ్, బిజిఎం స్కోర్ ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది చిత్ర బృందం. మేము అన్ని పాటలకు సంబంధించిన లిరికల్ వీడియోలపై వర్క్ చేస్తున్నాము. ప్రతినెలా ఒక్కో అప్డేట్ వస్తుంది. అక్టోబర్ 30న ఓ పాట తప్పకుండా వస్తుంది’ అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక నెటిజన్ ‘ముందు టీజర్..  తర్వాత పాటలు.. మేకర్స్ కి ఈ విషయాన్ని క్లియర్ గా చెప్పండి’ అని రిక్వెస్ట్ చేయగా.. ‘బ్రో మీ బాధ మాకు అర్థమయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కానీ వీటికి టీజర్ బ్రేక్ వేస్తుంది. మేము ఎంత వేగంగా వర్క్ చేసినా టీజర్ దసరాకు పేలకపోతే దీపావళికి కచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది. మేము కూడా దీన్ని పార్క్ నుంచి బయటకు కొట్టాలని అనుకుంటున్నాం. దీనికి అందరూ సహకరించాలి’ అంటూ రాసుకొచ్చి, టీజర్ దసరాకు రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని క్లారిటీ ఇచ్చారు.

సినిమా రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్

ఇక రీసెంట్ గా ఓ షోలో చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను క్రిస్మస్ కి రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ సమాచారం ప్రకారం ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజా ట్వీట్ లో తమన్ ‘గేమ్ ఛేంజర్’ డిసెంబర్ 20న లేదంటే క్రిస్మస్ కు రిలీజ్ కాబోతోంది అన్నట్టుగా ట్విట్ చేశారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×