BigTV English
Advertisement

Tollywood: పేరుకే టాప్ సెలబ్రిటీస్.. తెర వెనుకంతా రోతే..!

Tollywood: పేరుకే టాప్ సెలబ్రిటీస్.. తెర వెనుకంతా రోతే..!

Tollywood.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు తమ టాలెంట్ ను ఉపయోగిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇంత టాలెంట్ ఉన్న సెలెబ్రిటీలు సమాజంలో గౌరవంగా బయటకి కనిపించినా తెరవెనుక వీరు చేసే బాగోతం చూస్తే నిజంగా నీచం అనిపిస్తుంది. ముఖ్యంగా కొంతమంది సినీ ఇండస్ట్రీలో సినిమాల ద్వారా పాపులారిటీ సంపాదించుకుంటే మరి కొంతమంది యూట్యూబ్ ద్వారా పాపులర్ అవుతున్నారు ఇంకొంతమంది దానాలు చేస్తూ లేదా కామెడీ చేస్తూ సోషల్ మీడియా యూజర్లకు దగ్గరవుతున్నారు.


ఇలాంటి సెలబ్రిటీస్ లో కొంతమంది నీచులు అందరి గుర్తింపును స్పాయిల్ చేస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు. తెర వెనుక వీరు చేసే అరాచకాలు, బాగోతాలు , అఘాయిత్యాలు ఏదో ఒక రోజు బయటకి రాక తప్పదు.. అలాంటి రోజులు ఇటీవల కాలంలో చాలా మంది సెలబ్రిటీలకు వచ్చాయని చెప్పాలి. అయితే వారు ఎవరు? వారి మీద ఎలాంటి ఆరోపణలు వచ్చాయి..? అనే విషయాలు కూడా వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం.

నిర్మాత బన్నీ వాస్..


గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతున్న నిర్మాత బన్నీ వాస్ ఇండస్ట్రీలో మంచి పేరు మోసిన నిర్మాత. కానీ సునీత బోయ అనే నటి తను లైంగికంగా వేధించాడు అంటూ ఆరోపణలు చేసింది. సినిమా ఆఫర్లు ఇప్పిస్తానని తనను వాడుకున్నాడని ఆరోపించింది. అయితే ఆ తర్వాత కొంతకాలానికి అదే సునీత బోయ బన్నీ వాస్ ఏమి చేయలేదని , అతడి మాటలు తప్పుగా అర్థం చేసుకున్నానని క్లారిటీ కూడా ఇచ్చింది. మరి ఆ తర్వాత తెర వెనక ఏం జరిగిందో వారికే తెలియాలి.

ఫన్ బకెట్ భార్గవ్..

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గుర్తింపు తెచ్చుకున్న ఫన్ బకెట్ భార్గవ్ ఒక మైనర్ ను అత్యాచారం చేసి ప్రెగ్నెంట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. భార్గవ్ సోషల్ మీడియాలో కొన్ని ఆఫర్లు ఇస్తానని తమ అమ్మాయిని సంప్రదించాడట. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి, బెదిరించి ఆమె పై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. దీంతో అతడిని కొద్ది రోజులు పోలీసులు జైల్లో కూడా వేశారు.

హర్ష సాయి:

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న హర్ష సాయి ముంబైకి చెందిన నటిని వాడుకొని మోసం చేశాడని, లైంగికంగా అత్యాచారం చేశాడని ఆ నటి కేసు పెట్టింది. ప్రస్తుతం ఈ విషయంపై ఇంకా నిజా నిజాలు తెలియాల్సి ఉంది.

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్..

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల తన దగ్గర పని చేసే లేడీ అసిస్టెంట్ పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు ఆమె మైనర్ గా ఉన్నప్పుడే అత్యాచారం చేసినట్లు తెలిపింది. దీంతో అత్యాచారం కేసులో పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. ఇకపోతే ఇటీవలే ఈయనకు జాతీయ అవార్డు ప్రధానోత్సవం చేయాల్సి ఉండగా.. ఈ కేసులో ఇరుక్కోవడంతో తాత్కాలికంగా కమిటీ జాతీయ అవార్డును రద్దు చేసింది.

రాజ్ తరుణ్..

టాలీవుడ్ లో హీరో రాజ్ తరుణ్ .. తాను పెళ్లి చేసుకుంటానని చెప్పి, గర్భవతిని చేసి మోసం చేశాడని తన మాజీ ప్రియురాలు కేసు పెట్టింది. దీనితో అందరూ షాక్ అయ్యారు. ఆడియో కాల్స్ కూడా లీక్ అయ్యాయి. దీంతో యాక్టర్ రాజ్ తరుణ్ పై చార్జ్ షీట్ దాఖలైంది. మరి తీర్పు ఏ విధంగా ఉంటుందో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×