Prithvi Shaw: టీమిండియా యంగ్ బ్యాటర్ పృథ్వి షా కెరీర్ అగమ్యగోచరంగా మారింది. భారత్ తరపున అరంగేట్రంలోనే టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ బాదిన పృద్విషా.. కెరీర్ లో ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతాడని అంతా భావించారు. ఏకంగా అతన్ని {Prithvi Shaw} క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తోను పోల్చారు. పృద్విషా సచిన్ అంతటి ప్లేయర్ అవుతాడని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. కానీ ఆ తర్వాత క్రమశిక్షణరాహిత్యం, ఫిట్నెస్ ఫామ్ లేని కారణంగా భారత జట్టులో చోటు కోల్పోయాడు.
Also Read: Virat Kohli – Akashdeep: ఆకాశ్ దీప్ భారీ సిక్సర్.. విరాట్ కోహ్లీ క్రేజీ రియాక్షన్!
ఇప్పుడు ఏకంగా ముంబై రంజి జట్టుకు కూడా దూరమయ్యాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ – 2025 మెగా వేలంలోనూ షా {Prithvi Shaw} ని ఒక్క ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ఐపీఎల్ 2025 వేలంలో షా అమ్ముడుపోకపోవడంతో అతని ఫిట్నెస్ మీద పదేపదే చర్చలు జరిగేలా చేసింది. గత కొన్ని నెలలుగా అతని {Prithvi Shaw} ఫిట్నెస్ ప్రమాణాలు బలహీనంగా ఉండడం, క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్ల నుండి తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే తాజాగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరుపుల బ్యాటింగ్ ప్రదర్శనతో పృద్విషా తన ఫిట్నెస్ పై వస్తున్న విమర్శలను తిప్పి కొట్టాడు.
విదర్భతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ముంబై విజయానికి తోడ్పడేలా 26 బంతుల్లో 49 పరుగులు చేశాడు. 49 పరుగులలో 5 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో {Prithvi Shaw} తన ఆటను మళ్ళీ ప్రదర్శించాడు. దీంతో ముంబై విజయాన్ని అందుకుంది. కానీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం షా మరోసారి విఫలమయ్యాడు. దీంతో విమర్శలపాలయ్యాడు. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మధ్యప్రదేశ్ పై ముంబై సులువుగా విజయం సాధించింది.
కానీ పృద్విషా {Prithvi Shaw} మాత్రం ఆరు బంతుల్లో కేవలం 10 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో సోషల్ మీడియాలో షా ని లక్ష్యంగా చేసుకొని విమర్శల వర్షం కురిపించారు. అయితే తాజాగా విజయ్ హజారే ట్రోఫీ కోసం మంగళవారం ప్రకటించిన ముంబై జట్టులో పృధ్వి షా కి చోటు దక్కలేదు.
Also Read: ICC WTC 2025 final: మూడో టెస్ట్ డ్రా అయితే.. WTC నుంచి టీమిండియా తప్పుకోవడమేనా ?
దీంతో షా తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. ముంబై జట్టులో స్థానం కోల్పోవడం పై పృద్విషా {Prithvi Shaw} సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ” 65 ఇన్నింగ్స్ లలో 55.7 సగటు, 126 స్ట్రైక్ రేట్ తో 3399 పరుగులు చేశాను. అయినా నేను సరిపోలేదు. దేవుడా నేను ఇంకా ఏం చేయాలో చెప్పు..? ఈ స్టాట్స్ ఉన్న నేను పనికిరానా..? నీపైనే నమ్మకం పెట్టుకున్న. జనానికి నమ్మకం ఉందని ఆశిస్తున్నా. కాబట్టి నేను మళ్లీ తిరిగి వస్తాను. ఓం సాయిరాం” అని రాసుకొచ్చాడు.