Thandel: ప్రముఖ డైరెక్టర్ చందూ మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) తాజాగా నటించిన చిత్రం తండేల్ (Thandel). ఫిబ్రవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాలో సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా నటించింది. శ్రీకాకుళం మత్స్యకారులకు 2018లో ఎదురైన ఒక సంఘటనను ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ఎమోషనల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. మూడు రోజుల్లోనే రూ.62 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రూ.100 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది ఈ సినిమా. ఇదిలా ఉండగా.. ఈ సినిమా అలా విడుదల అయిందో లేదో అప్పుడే ఆర్టీసీ బస్సుల్లో ప్రదర్శించారు.
తండేల్ పైరసీ పై నిర్మాతలు..
ముఖ్యంగా ఆర్టిసీ బస్సుల్లో తండేల్ పైరసీ బొమ్మ వేయడం పై నిర్మాతలు సీరియస్ అవుతున్నారు. సినీ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravindh), బన్నీ వాసు(Bunny vasu).. తమ సినిమాను పైరసీ చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. “ముఖ్యంగా పైరసీ అనేది అతి పెద్ద క్రైమ్ అని, సినిమాను పైరసీ చేస్తున్న వాట్సాప్, వెబ్సైట్, టెలిగ్రామ్, గ్రూప్ అడ్మిన్ లకు ఇదే ఆఖరి హెచ్చరిక. కేసులు కూడా పెట్టాము. మీరు జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉంది ” అంటూ పైరసీ చేసిన వారిని ఉద్దేశించి నిర్మాత అల్లు అరవింద్ కామెంట్లు చేశారు. అలాగే బన్నీ వాసు కూడా మాట్లాడుతూ..” కొంతమంది తెలిసి, మరికొంతమంది తెలియక పైరసీ చేస్తున్నారు. ఎలా చేసినా పైరసీ అనేది క్రిమినల్ కేస్ కింద వస్తుంది. ఒకవేళ ఫైల్ అయితే మాత్రం కేసు వెనక్కి తీసుకోలేము. యువత దయచేసి ఇందులో ఇరుక్కోవద్దు. ఇప్పుడు ప్రతిదీ కూడా ట్రాక్ చేసే టెక్నాలజీ మనవద్ద ఉంది. మా సినిమా క్లిప్ ఒక్కటి ప్లే చేసిన సరే మేము కేసు పెడతాము” అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బన్నీ వాసు. ఈ విషయాలు సంచలనంగా మారాయి.
విచారణకు ఆదేశాలు జారీ చేసిన ఆర్టీసీ ఛైర్మన్..
ఇకపోతే ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో తండేల్ సినిమా పైరసీ వీడియోని ప్రదర్శించడంపై ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇకపోతే తమ ప్రమేయం లేకుండానే ఇలా జరిగిపోయిందని ఇలా ఆర్టీసీ బస్సుల్లో సినిమాను ప్రదర్శించిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని కొనకళ్ళ నారాయణరావు కూడా తెలిపారు. మొత్తానికి అయితే పైరసీ వివాదం ఇప్పుడు ఎంతవరకు దారితీస్తుందో అని, అటు సినీ సెలబ్రిటీలు ఇటు నెటిజెన్స్ కూడా తెలుసుకోవడానికి కాస్త ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.
రియల్ కథ ఇదే..
ఇక తండేల్ సినిమా విషయానికి వస్తే.. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు ఏడాదిలో తొమ్మిది నెలలు వేటకు వెళ్తారు. అందులో తండేల్ అనే ఒక గ్రూప్ కి నాయకుడు తన గ్రూప్ ను తీసుకొని.. గుజరాత్ కి వెళ్తే ఎక్కువ చేపలు పడతాయని ఫలితంగా డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశతో అక్కడికి వెళ్తారు .అనుకోకుండా పాకిస్తాన్ కోస్టల్ కి చిక్కి దాదాపు 17 నెలల పాటు పాకిస్తాన్ కోస్టల్ అధికారులు పెట్టే చిత్రహింసలు భరిస్తారు. ఆ తర్వాత బయటకు రావడం జరుగుతుంది. దీనిని ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పుడు పైరసీ వివాదం సంచలనంగా మారింది
APSRTC Chairman Konakalla Narayana Rao has ordered an inquiry into the alleged screening of a pirated version of the movie #Thandel on an @apsrtc bus.
ఏపీఎస్ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా పైరసీ వీడియోను ప్రదర్శించడంపై విచారణకు ఆదేశించిన ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు… https://t.co/hsM8wDRah5
— BSN Malleswara Rao (@BSNMalleswarRao) February 10, 2025