BigTV English

Beetroot For White hair: బీట్ రూట్ రసంతో భలే మ్యాజిక్.. ఇలా చేస్తే తెల్ల జుట్టు మాయం..!

Beetroot For White hair: బీట్ రూట్ రసంతో భలే మ్యాజిక్.. ఇలా చేస్తే తెల్ల జుట్టు మాయం..!

Beetroot Hair Mask: ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా.. నిండా ముప్పై ఏళ్లు రాకుండానే.. ప్రతి ఒక్కరు వైట్ హెయిర్ సమస్యలతో సతమతమవుతున్నారు. ఇందుకోసం బయట మార్కెట్లో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇవి తాత్కాలికంగా పనిచేస్తాయి కానీ.. శాశ్వతంగా పనిచేయవు.. పైగా మెదడులోని నరాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా హెయిర్ కలర్స్, హెయిర్ డై వంటివి ఉపయోగించడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


కాబట్టి ఇలా నాచురల్‌గా మన ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.. ఈ నాచురల్ టిప్స్ తరచూ ఉపయోగించడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారడంతో పాటు.. జుట్టు పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్యల కూడా తొలగిపోతాయి. బీట్‌రూట్ జుట్టుకే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని మనందరికి తెలిసిందే. కాబట్టి ఓసారి ఈ చిట్కాలు పాటించండి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్గాలు
⦿ బీట్ రూట్


⦿ ఉసిరికాయ పొడి

⦿ గోరింటాకు పొడి

⦿ విటమిన్ ఇ క్యాప్సూల్స్

తయారు చేసుకునే విధానం.
ముందుగా బీట్‌రూట్ ముక్కలను మెత్తగా గ్రైండ్ చేసుకుని వడుకట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోయాలి. అందులో ఉసిరి పొడి, గోరింటాకు పొడి వేసి 10 నిమిషాలు మరిగించాలి. అందులో తయారు చేసుకున్న బీట్‌రూట్ జ్యూస్ పోసి కొంచెం సేపు మరిగించండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ మిశ్రమాన్ని బౌల్‌లో తీసుకుని రాత్రంతా అలానే ఉంచండి. మరుసటి రోజుకల్లా నల్లగా మారుతుంది. దీన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా నెలకు ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. క్రమంగా తెల్లజుట్టు రావడం ఆగిపోతుంది. తెల్లజుట్టు నల్లగా మార్చేందుకు మరొక చిట్కా.

Also Read: మీ అతి ప్రేమ, అతి కేరింగ్ మీ భాగస్వామిని ఇబ్బంది పెట్టవచ్చు, ఈ పనులు చేయకండి

కావాల్సిన పదార్ధాలు
⦿ పసుపు

⦿ బాదం నూనె

⦿ ఉల్లిపాయ తొక్కలు

తయారు చేసుకునే విధానం.
ముందుగా స్టవ్ వెలిగించి ఉల్లిపాయ తొక్కలను నల్లగా వేయించాలి. వీటిని మెత్తగా మిక్సీపట్టి పొడి చేసుకోవాలి. మరొక కడాయి పెట్టుకుని అందులో బాదం నూనె, పసుపు వేసి 10 నిమిషాల పాటు మరిగించండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి చిన్న గిన్నెలోకి తీసుకుని అందులో తయారు చేసుకున్న పొడిని వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. క్రమంగా తెల్లజుట్టు రావడం ఆగిపోతుంది. ఇందులో ఉపయోగించే పదార్ధాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Thyroid Disease: థైరాయిడ్ ఉన్న వారు.. పొరపాటున కూడా ఇవి తినొద్దు !

Easy Egg Recipes: ఎగ్స్‌తో తక్కువ టైంలో.. సింపుల్‌గా చేసే బెస్ట్ రెసిపీస్ ఇవే !

Dondakaya Fry: పక్కా ఆంధ్రా స్టైల్ దొండకాయ ఫ్రై.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్

Health tips: గుండెల మీద ఎవరైనా కూర్చొన్నట్లు అనిపిస్తోందా? దానిని ఏమంటారో తెలుసా?

Navratri Fasting: నవరాత్రి ఉపవాస సమయంలో.. ఈ ఫుడ్ తింటే ఫుల్ ఎనర్జీ !

Fast Eating: టైం లేదని వేగంగా తింటున్నారా ? ఎంత ప్రమాదమో తెలిస్తే ఈ రోజే మానేస్తారు !

Dates Benefits: డైలీ రెండు ఖర్జూరాలు తింటే ? బోలెడు లాభాలు !

Big Stories

×