Thandel : అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన ‘తండేల్’ (Thandel) మూవీ ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాతో నాగ చైతన్య కెరీర్ బెస్ట్ కొడతాడా ? అనే ఆసక్తి పెరిగిపోయింది. ఈ సినిమాకు ఇప్పటికే 30 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ మూవీకి నిర్మాతలు నాగ చైతన్యకు మార్కెట్ కు మించి, దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ ను పెట్టడంతో మరింత ఆసక్తి పెరిగిపోయింది. అయితే నిజానికి నాగచైతన్య ఇంకా టైర్ 1 హీరోల లిస్టులో చేరలేదనే చెప్పాలి.
మరి కొన్ని గంటల్లోనే ‘తండేల్’ మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలోని హైయ్యెస్ట్ బిజినెస్ చేసిన మిడ్ రేంజ్ (టైర్ 2) హీరోల సినిమాలు ఏంటి? అందులో ‘తండేల్’ మూవీ ఏ ప్లేస్ లో ఉంది? అనే విషయాన్ని తెలుసుకుందాం.
హైయ్యెస్ట్ థియేట్రికల్ బిజినెస్ చేసిన మిడ్ రేంజ్ హీరోల సినిమాల లిస్ట్
లాభాలు తెచ్చింది రెండు సినిమాలే
ఈ టాప్ టెన్ లిస్టులో నిర్మాతరకు లాభాలు తెచ్చిపెట్టింది మాత్రం రెండు సినిమాలే. ఆ రెండు దసరా, సరిపోతా శనివారం. ఇక ఈ రెండు సినిమాలు కూడా నాని నటించిన సినిమాలే కావడం విశేషం. నాని సినిమా అంటే మినిమం గ్యారంటీ హిట్ అన్న విధంగా ఆడుతున్నాయి ఆయన సినిమాలు. మిగతా హీరోల సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ఇక ఇప్పుడు నాగచైతన్య తండాలు మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
‘తండేల్’ థియేట్రికల్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఆంధ్రాలో థియేట్రికల్ రైట్స్ సుమారుగా రూ.16 కోట్ల, నైజాం రైట్స్ రూ. 11 కోట్ల కోట్లు… రెండు రాష్ట్రాల్లో రూ.27 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా 28 కోట్ల షేర్, 60 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాలి నాగచైతన్య మూవీ. కర్ణాటక థియేట్రికల్ రైట్స్ రూ. 3 కోట్లు. హిందీ రైట్స్ రూ. 10 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ.12 కోట్లు.. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా రూ. 52 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, 54 కోట్ల షేర్ వసూలు చేస్తే నిర్మాతలు లాభాల బయట పడతారు.
ఈ మూవీ 52 కోట్లకు పైగా బిజినెస్ తో హైయెస్ట్ థియేట్రికల్ బిజినెస్ చేసిన మిడ్ రేంజ్ సినిమాల లిస్ట్ లఓ టాప్ 2లో ఉంది. అయితే ప్రస్తుతమున్న బజ్ ను దృష్టిలో పెట్టుకొని చూస్తే. ‘తండేల్’ మూవీ బ్రేకింగ్ ఈవెన్ టార్గెట్ ని రీచ్ కావడం అన్నది పెద్ద సమస్య ఏం కాదు. ఈ మూవీ గనక బ్లాక్ బస్టర్ హిట్ అయితే నాగచైతన్య కెరియర్ కీలక మలుపు తిరుగుతుంది.