E-Paper
Advertisement

HDFC Bank Jobs: డిగ్రీ అర్హతతో HDFCలో 500 ఉద్యోగాలు.. ఇంకా 2 రోజులే ఛాన్స్..

HDFC Bank Jobs: డిగ్రీ అర్హతతో HDFCలో 500 ఉద్యోగాలు.. ఇంకా 2 రోజులే ఛాన్స్..

HDFC Bank Jobs: డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది సువర్ణ అవకాశం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఇవ్వనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తుకు ఇంకా రెండు రోజులు మాత్రమే గడువు ఉంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) సహకారంతో రిలేషన్ షిప్ మేనేజర్- ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి సమాచారం చూద్దాం.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 500 ఉద్యోగాలు

ఇందులో రిలేషన్ షిప్ మేనేర్- ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా  ఉన్నాయి.

విద్యార్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. 1 నుంచి 10 సంవత్సరాల ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

వయస్సు: దరఖాస్తు చివరి తేది నాటికి 35 సంవత్సరాలు మించరాదు.

జీతం: ఏడాదికి రూ.3లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వేతనం ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు ఫిబ్రవరి 7 వ తేదీలోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగ ఎంపిక విధానం: ఆన్ లైన్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

ఉద్యోగం చేయాల్సిన ప్లేస్: దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఎక్కడైనా చేయాల్సి ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వైజాగ్, ఢిల్లీ, అహ్మదాబాద్, వడోదర, బెంగళూరు, మంగళూరు, భోపాల్, ముంబయి, పుణె, అమృత్ సర్, జయపుర, లక్నో, కోల్ కతాలో పరీక్ష నిర్వహించనున్నారు.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 7

ఆన్ లైన్ పరీక్ష తేది: 2025 మార్చి

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.hdfcbank.com/

అర్హత ఉన్న అభ్యర్థుందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై సంబంధిత విభాగంలో వర్క్ ఎక్స్ పీయన్స్ ఉంటే ఉద్యోగాలకు అర్హులవుతారు. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పిస్తారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి ఏడాదికి రూ.3లక్షల నుంచి రూ.12 లక్షల వరకు జీతం ఉంటుంది. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

Also Read: NRDRM Recruitment: గోల్డెన్ ఛాన్స్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 13,762 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ..

ముఖ్యమైనవి:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 500 ఉద్యోగాలు

జీతం: ఏడాదికి రూ.3లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వేతనం ఉంటుంది.

వయస్సు: దరఖాస్తు చివరి తేది నాటికి 35 సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తుకు చివరి తేది: ఫిబ్రవరి 7 (దరఖాస్తుకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది)

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×