SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ లో అత్యంత పటిష్టంగా ఉన్న జట్టు ఏదంటే.. వెంటనే గుర్తొచ్చే పేరు సన్ రైజర్స్ హైదరాబాద్. 2025 సీజన్ కి సంబంధించి మెగా వేలంలో అలాంటి డేంజరస్ ప్లేయర్స్ ని కొనుగోలు చేసింది హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ రెండు విభాగాలలో పటిష్టమైన ప్లేయర్లను కొనుగోలు చేసింది హైదరాబాద్ మేనేజ్మెంట్.
Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఆస్ట్రేలియా కు ఎదురు దెబ్బ.. ఆ ప్లేయర్ దూరం!
మెగా వేలానికి ముందు ఎక్కువగా ఫారన్ ప్లేయర్లను రిటైన్ చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్.. వేలంలో కీలక ఆటగాళ్లను సొంతం చేసుకుంది. హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమీన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి ని రిటైన్ చేసుకున్న హైదరాబాద్ ఫ్రాంచైజీ.. మెగా వేలంలో మరో 15 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. రూ. 45 కోట్ల తక్కువ మొత్తంతో వేలంలో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ.. ఆటగాళ్ల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
ఈ నేపథ్యంలో యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ని రూ. 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇషాన్ కిషన్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీని రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే హర్షర్ పటేల్ కోసం 8 కోట్లు, సమర్జీత్ సింగ్ కి రూ.1.50 కోట్లు, జయదేవ్ ఉనద్కట్ రూ 1 కోటి, ఇంగ్లాండ్ పేస్ బౌలర్ బ్రైడెన్ కార్సే ని కోటి రూపాయలకు సొంతం చేసుకుంది.
అలాగే రాహుల్ చాహర్ 3.20, అడమ్ జంపా 2.40, జిషన్ అన్సారి 40 లక్షలు, ఇలా ముగ్గురు స్పిన్నర్లను వేలంలో కొనుగోలు చేసింది. అలాగే అన్ క్యాప్డ్ ప్లేయర్ అభినవ్ మనోహర్ కోసం ఏకంగా 3.20 కోట్లు ఆఫర్ చేసింది. ఇక శ్రీలంక ఆటగాళ్లు ఇషాన్ మలింగ 1.20, కామందు మెండీస్ 75 లక్షలు, అధర్వ టైడే 30 లక్షలు, అనికేత్ వర్మ 30 లక్షలు, సచిన్ బేబీ 30 లక్షలకు దక్కించుకుంది. ఈ టీమ్ పై కావ్య మారను కూడా హ్యాపీగా ఉంది.
Also Read: Ricky Ponting Wine: నా లిక్కర్ తాగండ్రా బాబు.. ఇండియన్స్ ను వేడుకుంటున్న పాంటింగ్ ?
ఈ డేంజరస్ ప్లేయర్స్ తో ఈసారి కప్ కొట్టడం ఖాయమని భావిస్తుంది. ఐపీఎల్ 2025లో ఈ టీమ్ తో ఇక ప్రత్యర్థులకు చుక్కలేనని SRH అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్.ఆర్.హెచ్ టీమ్ లోని కీలక ప్లేయర్ల ఫోటోలు, అతడు సినిమాలో బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి మధ్య జరిగే సంభాషణ ఆధారంగా ఓ వీడియోని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు హైదరాబాద్ జట్టు అభిమానులు. ఇలా క్రియేట్ చేసిన అతడు సినిమాలోని డైలాగ్స్ తో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">