BigTV English

Devara : దేవరను భయపెడుతున్న ఆ సెంటిమెంట్.. ఆ ఒక్కటే ఎన్టీఆర్ కు మైనస్..

Devara : దేవరను భయపెడుతున్న ఆ సెంటిమెంట్.. ఆ ఒక్కటే ఎన్టీఆర్ కు మైనస్..

Devara : టాలీవుడ్ లో ఎన్టీఆర్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది.. ఈయన నటిస్తున్న సినిమాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. త్రిపుల్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా వైడ్ అభిమానులను సంపాదించుకున్నాడు.. ఎన్టీఆర్ నటనకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ను చూడాలనుకునే వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర.. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని జనాలు ఎదురు చూస్తున్నారు. ఇక కేజిఎఫ్ రేంజ్ లో ఉంటుందని ఎన్టీఆర్ కెరీర్ లో భారీ వసూళ్లు సాధించే సినిమాగా ఈ సినిమా నిలిచే అవకాశం ఉండవచ్చునని మరోవైపు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


త్రిపుల్ఆర్ తర్వాత భారీ అంచనాలతో థియేటర్లలోకి దేవర సినిమా ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఎన్టీఆర్ కెరీర్ కు ఈ సినిమా ప్లస్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈ సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం కచ్చితంగా ఎన్టీఆర్ తో భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి ముందుకు వస్తారు నిర్మాతలు అనే మాట వాస్తవం. అయితే ఇక్కడ ఫ్యాన్స్ ని ఒక విషయం భయపెడుతోంది.. ఆ సెంటిమెంట్ మరేంటో కాదు.. సీక్వెల్ గా వస్తున్న సినిమాలే.. గతంలో నుంచి ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ఎన్టీఆర్ చేశాడు.

That sentiment that scares Devara.. That is the only minus for NTR.
That sentiment that scares Devara.. That is the only minus for NTR.

ఎన్టీఆర్ ఇప్పటివరకు చేసిన కొన్ని సినిమాలు డిజాస్టర్ కావడమే. సాధారణ డిజాస్టర్ లు కాదు అవి. అందుకే ఫ్యాన్స్ లో కంగారు మొదలయింది. ఆ సినిమాలు ఏంటీ అనేది చూస్తే… మగధీర సినిమా చూసి శక్తి సినిమా తీస్తే అది దారుణంగా ఫ్లాప్ అయింది. నిర్మాత అశ్వినీదత్ కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ఇక పోకిరి సినిమా చూసి అలాగే కంత్రీ సినిమా చేస్తే అది కూడా ఫ్లాప్ అయింది. ఆ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా సన్నబడ్డాడు. ఇక దూకుడు సినిమా చూసి అదే డైరెక్టర్ తో బాద్షా సినిమా తీస్తే బ్రహ్మానందం కామెడి మినహా ఏం లేదు. ఇక కిక్ చూసి ఊసరవెల్లి అలాగే భిన్నంగా తీసే ప్రయత్నం చేస్తే ఎన్టీఆర్ నటనకు మార్కులు పడినా సినిమా ఆకట్టుకోలేదు. ఇక ప్రస్తుతం కేజీఎఫ్ సినిమాను చూసి దేవర సినిమాను చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎంతవరకు హిట్ అవుతుందా అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఇక దేవర ఈనెల 27 న విడుదల కాబోతుంది. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి… ఇప్పటివరకు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఇక రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఏది ఏమైనా దేవర సినిమా కోసం అందరు వెయిట్ చేస్తున్నారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×