EPAPER

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

BMW launches XM Label In India: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారును విడుదల చేసింది. ‘ఎక్స్ఎమ్ లేబుల్’ పేరుతో ఈ లేటెస్ట్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ధరను రూ. 3.15 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది. ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర బీఎండబ్ల్యూ కార్లతో పోల్చితే ఈ కారు అత్యంత ప్రత్యేతకంగా రూపొందింది.


లేటెస్ట్ ఇంజిన్, పవర్ అప్‌ గ్రేడ్

గత ఏడాది బీఎండబ్ల్యూ సంస్థకు సంబంధించిన ‘ఎక్స్ఎమ్ లేబుల్ రెడ్’ కారు గ్లోబల్ మార్కెట్లోకి విడుదల అయ్యింది. ఈ కారు భారత్ లోకి కొత్త పేరుతో అడుగు పెట్టింది. ‘ఎక్స్ఎమ్ లేబుల్’ పేరుతో దేశీయ మార్కెట్లోకి వచ్చింది. ఈ కారు 4.4 లీటర్ ట్విన్ టర్బో వీ8 హైబ్రిడ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. 748 హార్స్ పవర్ తో పాటు 1000 ఎన్ఎమ్ టార్క్ ను అందిస్తున్నది. ఈ కారులో 25.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ను అమర్చారు. ఈ కారు గరిష్టంగా 82 కి.మీ రేంజ్ ను అందిస్తోంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు 3.8 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.  ఈ కారు ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ ఆప్షన్ పొందుతున్నది.


ప్రీమియం ఫీచర్లు

బీఎండబ్ల్యూ ఎక్స్ఎమ్ లేబుల్ పలు ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది. కిడ్నీ గ్రిల్ సరౌండ్, రియర్ డిఫ్యూజర్ ఇన్సర్ట్, మోడల్ బ్యాడ్జ్‌లు, విండో ఫ్రేమ్ సరౌండ్, షోల్డర్ లైన్, వీల్ ఇన్‌సర్ట్ లు ప్రత్యేకంగా రూపొందించారు. ఈ కారులో 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్  అమర్చారు. ఇంటీరియర్ కూడా రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో అద్భుతంగా ఆకట్టుకుంటున్నది. ఎక్స్ఎమ్ లేబుల్ లో ప్రత్యేకమైన డిజైన్, పవర్‌ ట్రెయిన్‌ తో పాటు 14.9 అంగుళాల టచ్‌ స్క్రీన్, 12.3-అంగుళాల డ్రైవర్ డిస్‌ ప్లే, బోవర్స్,  విల్కిన్స్ సరౌండ్ సౌండ్ సిస్టమ్,   కర్వ్డ్ డిస్‌ ప్లేతో సహా అనేక అధునాతన ఫీచర్లో ఈ కారు అందుబాటులోకి వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా కేవలం 500 కార్లు   

బీఎండబ్ల్యూ కంపెనీ ఈ సరికొత్త కారును ప్రపంచ వ్యాప్తంగా కేవలం 500 యూనిట్లను మాత్రమే తయారు చేసింది. ఈ కార్లలో కేవలం ఒకే ఒక్క కారును భారత్ కు కేటాయించింది. అంటే, భారత్ లో కేవలం ఒకే ఒక్కరు ఈ కోరును కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈ కారు స్పెషల్ ఎడిషన్  అని చెప్పేందుకు  కంట్రోల్ డిస్ ప్లే కింద ‘500 In 1’ అని రాశారు.

బీఎండబ్ల్యూ సరికొత్త కారు ధర రూ. 3.15 కోట్లు

బీఎండబ్ల్యూ కంపెనీ సరికొత్తగా అంబాటులోకి తీసుకొచ్చిన ఎక్స్ఎమ్ లేబుల్ కారు ధరను రూ. 3.15 కోట్లు(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. లగ్జరీ SUV సెగ్మెంట్‌ లో ప్రత్యేకమైన కారు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుల కోసం కంపెనీ ఈ కారును రూపొందించింది.

 Read Also:ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

Related News

Vande Bharat Sleeper: వందే భారత్ లో కాశ్మీర్ వెళ్లిపోవచ్చు, ఎప్పటి నుంచో తెలుసా?

Indian Railways: ఒకే టికెట్ కు రెండు ధరలా? రైల్వేలో ఇలా కూడా జరుగుతుందా?

Boeing Mass layoffs: 17000 మంది ఉద్యోగులను తొలగించనున్న బోయింగ్.. వేల కోట్ల నష్టమే కారణం..

Dussehra : దసరా బోనస్​ వచ్చిందా? – ఇలా చేస్తే మరింత ఎక్కువ సంపాదించొచ్చు!

Railways New Service: ఒకే టికెట్ తో 56 రోజుల ప్రయాణం- దేశం అంతా చుట్టేయొచ్చు, ధర కూడా తక్కువేనండోయ్!

Ratan Tata Successor: రతన్ టాటా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడెవరు? పోటీలో ఉన్న ముగ్గురి ప్రత్యేకత ఇదే!

Airtel Acquire TATA Play: టాటా ప్లే కొనుగోలు చేసే యోచనలో ఎయిర్ టెల్.. డిటిహెచ్ రంగంలో విప్లవమే..

Big Stories

×