BigTV English

Devara: ఆరోజే దేవర.. అరేయ్.. ఏం మాట్లాడుతున్నార్రా.. పవన్ ఫ్యాన్స్ కు నరాలు కట్ అయిపోయాయి

Devara: ఆరోజే దేవర.. అరేయ్.. ఏం మాట్లాడుతున్నార్రా.. పవన్ ఫ్యాన్స్ కు నరాలు కట్ అయిపోయాయి

Devara: దేవర.. ఏ ముహూర్తాన ఈ సినిమా మొదలయ్యిందో కానీ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కునుకు లేకుండా చేస్తోంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటుస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా..బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.


ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులకు హైప్ పెంచేశాయి. ఎప్పటినుంచో ఈ సినిమా వాయిదాల మీద నడుస్తోంది. ఆ రోజున రిలీజ్ అవుతుంది.. ఈరోజున రిలీజ్ అవుతుంది అంటూ మేకర్స్ చెప్తున్నారు.. ఆ తరువాత వాయిదా వేస్తున్నట్లు చెప్పి షాక్ ఇస్తున్నారు. మొదట దేవర ఒక పార్ట్ అని చెప్పారు.. ఆ తరువాత రెండు పార్ట్స్ గా రిలీజ్ అవుతుందని.. మొదటి పార్ట్ అక్టోబర్ 10 న రిలీజ్ కానుందని అధికారికంగా చెప్పడంతో సరే అని ఆరోజు కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ డేట్ కూడా మారిందని వార్తలు వస్తున్నాయ్. అంటే వెనక్కి కాదు.. ముందుకు. అవును.. అక్టోబర్ లో రిలీజ్ కావాల్సిన దేవర.. సెప్టెంబర్ లోనే రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. అది కూడా OG రిలీజ్ డేట్ నా.. ? ఇక ఈ వార్త విన్న పవన్ ఫ్యాన్స్.. అరేయ్ ఏం మాట్లాడుతున్నార్రా.. నరాలు కట్ అయిపోయాయి అని షాక్ అవుతున్నారు.


అసలు విషయం ఏంటంటే.. కొన్ని కారణాల వలన OG మూవీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంట. అందుకే డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్.. OG కోసం కొత్త డేట్ ను వెతికే పనిలో ఉన్నారట. ఈ విషయం తెలియడంతో.. OG డేట్ అయినా సెప్టెంబర్ 27 ను మిగతా సినిమాలు లాక్ చేసుకొనే పనిలో పడ్డారట. ఇప్పటికే లక్కీ భాస్కర్ అదే రోజును లాక్ చేసుకుంది.

ఇక ఇప్పుడు దేవర కూడా ఆడేట్ ను లాక్ చేస్తుందని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఇంకోపక్క పవన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సిందిగా కామెంట్స్ పెడుతున్నారు. మరి OG కనుక సెప్టెంబర్ లో రాకపోతే ఎప్పుడు వస్తుంది అని అభిమానులు కంగారుపడుతున్నారు. మరి ఈ వార్తపై OG మేకర్స్ ఎలా స్పందిస్టారో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×