Parvati Nair Accuses : హీరోయిన్‌పై ఆమె దగ్గర పని చేసే పనిమనిషి సంచలన ఆరోపణలు చేయటం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే, మలయాళ హీరోయిన్ పార్వతీ నాయర్ చెన్నైలోని నుంగబాకంలో ఉంటుంది. గత నెలలో ఆమె ఇంట్లో రూ.9 లక్షలు విలువైన రెండు వాచీలు.. రూ.2 లక్షలు విలువైన ల్యాప్ టాప్.. రూ.1.5 లక్షలు విలువైన ఐ పోన్ పోయింది. దీనిపై ఆమె తన ఇంట్లో పని చేసే సుభాష్ చంద్రబోస్‌పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు పార్వతీ నాయర్‌పై సుభాష్ సంలచన ఆరోపణలు చేశారు.
పార్వతీ నాయర్ ఇంట్లోకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వెళ్లటం తాను చూడటం వల్లనే వేధింపులకు గురవుతున్నానని సుభాష్ తెలిపారు. ఆమె ఇంట్లోకి ఎవరో వచ్చి దొంగతనం చేస్తే తనను మానసికంగా వేధిస్తుందని, లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరిస్తుందని సుభాష్ తెలిపాడు. గతంలో తనను రెండు సార్లు చెంపపై కొట్టటమే కాకుండా.. ముఖంపై ఉమ్మేసిందని కూడా సుభాష్ చెప్పాడు. ఈ కేసు మరిప్పుడు ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి. పార్వతీ నాయర్ తెలుగులో మినహా దక్షిణాది సినిమాల్లో హీరోయిన్‌గా, కీలక పాత్రల్లో నటించి తనదైన గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే.