Puri Jagannadh: ప్రస్తుతం కొంచెం సినిమాలు తీయడంలో వెనుక పడ్డాడు కానీ ఒకప్పుడు పూరి జగన్నాథ్ అంటేనే స్టార్ డైరెక్టర్. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోలతో రిపీటెడ్ గా వర్క్ చేశాడు పూరి. చాలామంది లాగా సంవత్సరాలు సంవత్సరాలు తీసుకోకుండా కేవలం రోజుల్లోనే ఫినిష్ చేయగలిగే సత్తా ఉన్న ఏకైక దర్శకుడు. స్టార్ హీరోని కూడా చాలా ఈజీగా డీల్ చేస్తాడు. కేవలం ఒక డైలాగ్ తోనే సీన్ పైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. టెంపర్ సినిమా తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మళ్లీ పూరి జగన్నాథ్ చూడలేకపోయాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా కొంతమేరకు పరవాలేదు అనిపించుకుని మంచి లాభాలు తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన లైజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంటుంది అని అందరూ ఊహించరు. కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది.
ప్రస్తుతం ఫామ్ లో లేడు
ఇక పూరి జగన్నాథ్ విషయానికి వస్తే వరుసగా డిజాస్టర్లు తనను వెంటాడుతున్నాయి. ఈసారి మాత్రం ఖచ్చితంగా హిట్ కొట్టాలి అనే ఉద్దేశంతో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా సినిమా చేస్తున్నారు. విజయ్ సేతుపతి స్టోరీస్ సెలక్షన్ కొంతమేరకు బానే ఉంటుందని ఇదివరకే చేసిన సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు పూరి గారి కథను ఓకే చేశాడు అంటే కథలో దమ్ముంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి భవతీ భిక్షాందేహి అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం వినిపిస్తుంది. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రానుంది. అననే ఈ సినిమాలో పెద్దపెద్ద స్టార్ కాస్ట్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడు పూరి జగన్నాథ్.
పూరి లాంటి దర్శకులు కావాలి
ఒకప్పుడు స్టార్ హీరోలు సైతం సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం రెండేళ్లకు ఒక సినిమా మూడు ఏళ్లకు ఒక సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుంది. దీనివలన థియేటర్కు వచ్చే ఆడియన్స్ సంఖ్య అమాంతం తగ్గిపోతుంది. ఈ తరుణంలో పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ కొత్త మలుపు తీసుకుంటుంది. స్టార్ హీరోలతో త్వర త్వరగా సినిమాలు చేస్తే థియేటర్ మళ్లీ కళకళలాడుతుంది. అయితే ప్రస్తుతం పూరీనే ఫామ్ లో లేడు. అతను కూడా అందరి దర్శకులు నాని సినిమా లేట్ చేయడం అలవాటు చేసుకున్నాడు. ఇలాంటి పూరిని చూస్తుంటే పూరి జగన్నాథ్ సినిమాలో డైలాగ్ లాగానే మీరు మారిపోయారు సార్ అని అనాలనిపిస్తుంది.
Also Read : Manchu Manoj: నా దొంగతనాలకు నాన్న మోహన్ బాబే హెల్ప్ చేశాడు… టాప్ సీక్రెట్ బయపెట్టిన మనోజ్