BigTV English

Manchu Manoj: నా దొంగతనాలకు నాన్న మోహన్ బాబే హెల్ప్ చేశాడు… టాప్ సీక్రెట్ బయపెట్టిన మనోజ్

Manchu Manoj: నా దొంగతనాలకు నాన్న మోహన్ బాబే హెల్ప్ చేశాడు… టాప్ సీక్రెట్ బయపెట్టిన మనోజ్

Manchu Manoj: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో మనోజ్ ఒకరు. ఆ మధ్య కాలంలో మనోజ్ సినిమాలు చేయడం కంప్లీట్ గా తగ్గించేసాడు. దానికి పలు రకాల కారణాలు ఉన్నాయి. కెరీర్ స్టార్టింగ్ లో మనోజ్ ఎంచుకున్న సినిమాలు చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయ్యేవి. ముఖ్యంగా మనోజ్ సినిమాల్లోని కొన్ని పాటలు ఇప్పటికీ కూడా విపరీతంగా వినిపిస్తాయి. మనోజ్ చేసిన కొన్ని సినిమాల్లో పాటలకి లిరికల్ వాల్యూ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఒక్కడే మిగిలాడు సినిమా తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మనోజ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో వరుసగా సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. రీసెంట్ గానే భైరవం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం మనోజ్ మిరాయి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.


ఇంట్లోనే దొంగతనం 

మనలో చాలామంది చిన్నతనంలో కొన్ని చిలిపి పనులు చేసే ఉంటారు. అలానే సెలబ్రిటీస్ కూడా కొన్ని కొన్ని చిలిపి పనులు చేస్తుంటారు. అవన్నీ కొన్ని సందర్భాల్లో వినడానికి నవ్వు తెప్పిస్తాయి. ఇక మనోజ్ విషయానికి వస్తే వాళ్ళ ఇంట్లో డబ్బులు దొంగతనం చేసేవాడు అంట. ముఖ్యంగా పర్స్ బయట పెడితే ఒకటి పదిసార్లు మంచు లక్ష్మి, మరియు మనోజ్ వాళ్ళమ్మ చెక్ చేసుకునే వాళ్ళని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ముఖ్యంగా మనోజ్ వాళ్ళ అమ్మ పర్సులో నుంచి డబ్బులు తీయడానికి మోహన్ బాబు హెల్ప్ చేసేవారట. ఆ పర్సులో డబ్బులు మోహన్ బాబు కూడా కొంత కొంత తీసుకొని మిగతాది మనోజ్ కి ఇచ్చేవాడు. ఇక ప్రస్తుతం మనోజ్ కి అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రస్తుతం మనోజ్ కూడా సినిమాలు చేస్తూ సొంతగా రెమ్యూనరేషన్ సంపాదించుకుంటున్నాడు.


మంచు ఇంట్లో వివాదం 

మంచు ఫ్యామిలీ విషయానికి వస్తే చాలా వివాదాలు జరుగుతున్నాయి. కొన్నేళ్ల క్రితం మనోజ్ ఇంట్లోకి విష్ణు మనుషులు వచ్చి దాడి చేస్తున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే మీడియా దానిని హైలెట్ చేస్తున్న తరుణంలో అది ఒక రియాలిటీ షో అంటూ కవర్ చేశారు. ఆ తర్వాత చాలావరకు ఉన్న ఆస్తి గొడవలు బహిరంగంగానే బయటపడిపోయాయి. కొన్ని రోజులు పాటు మీడియా ఈ ఫ్యామిలీ చుట్టూ తిరిగింది. ఇప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ఎప్పటికైనా ఈ ఫ్యామిలీ కలుస్తుందో లేదో అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంది. ఈ సంఘటన అంతటిలో మోహన్ బాబు పై కూడా కొంతమేరకు నెగిటివిటీ పుట్టుకొచ్చింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×