BigTV English

PKSDT: మామ అల్లుళ్ల సినిమా టైటిల్ ఖ‌రారు!

PKSDT: మామ అల్లుళ్ల సినిమా టైటిల్ ఖ‌రారు!

PKSDT: క్రేజీ మూవీగా మెగాభిమానులు, ప్రేక్ష‌కులు ఎదురు చూస్తోన్న సినిమా PKSDT. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోలుగా న‌టిస్తున్నారు. ఇద్ద‌రు మామ‌, అల్లుడు కావ‌టంతో పాటు తొలిసారి సిల్వ‌ర్ స్క్రీన్‌పై వీరిద్ద‌రూ న‌టిస్తుండ‌టంతో సినిమాపై మంచి అంచ‌నాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది. అదేంటంటే సినిమా టైటిల్. మూవీ మేకింగ్ స‌మ‌యంలో గోపాల గోపాల 2, దేవుడే దిగి వ‌చ్చినా వంటి పేర్లు వినిపించాయి. కానీ తాజా స‌మాచారం ప్రకారం ఆ టైటిల్స్ ఏవీ కావ‌ట‌. బ్రో అనే టైటిల్‌ను పెడుతున్నార‌ని మ‌రో రెండు రోజుల్లో అనౌన్స్ చేస్తారంటున్నారు.


త‌మ్ముడో, అన్న‌ని ఇంగ్లీష్‌లో బ్ర‌ద‌ర్ అని పిలుస్తుంటాం. దానికి షార్ట్ క‌ట్ ఫాం బ్రో. దాన్ని సినిమా టైటిల్‌గా పెట్టటం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. త‌మిళ చిత్రం వినోద‌య సిత్తంకు ఇది రీమేక్‌. స‌ముద్ర ఖని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ సినిమాను త‌మిళంలో డైరెక్ట్ చేశారు. అయితే తెలుగు విష‌యానికి వ‌స్తే స‌ముద్ర ఖ‌ని సినిమాను డైరెక్ట్ మాత్ర‌మే చేశారు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే సినిమాను పూర్తి చేశారు స‌ముద్ర ఖ‌ని. ముందుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేశారు. ఇప్పుడు మిగిలిన సినిమాను కంప్లీట్ చేసే ప‌నిలో ఉన్నార‌ట ద‌ర్శ‌క నిర్మాత‌లు.

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భ‌క్తుడు కోసం దేవుడు భూమి మీద‌కు వ‌చ్చి అత‌నికి అండ‌గా నిల‌బ‌డి ఏం చేశాడ‌నేదే క‌థాంశం. త్రివిక్ర‌మ్ ఈ సినిమా రైటింగ్ విష‌యంలో త‌న‌దైన బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించిన‌ట్లు స‌మాచారం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు మార్పులు చేర్పులు చేసి సినిమాను తెర‌కెక్కిస్తున్నారు సముద్ర ఖ‌ని.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×