BigTV English

Priyamani: చిరంజీవితో సినిమా చేయాల‌నుంది

Priyamani: చిరంజీవితో సినిమా చేయాల‌నుంది

Priyamani: కెరీర్ ప్రారంభంలోనే నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకుని అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన న‌టి ప్రియ‌మ‌ణి. అక్క‌డ నుంచి ఈ అమ్మ‌డు త‌న జోరుని తగ్గించ‌నే లేదు. తెలుగు, త‌మిళంతో పాటు హిందీ చిత్రాల్లోనూ న‌టించి మెప్పించింది. అగ్ర హీరోలంద‌రితోనూ ఆడిపాడింది. ఇప్పుడు త‌న పంథాను మార్చుకుంది ప్రియ‌మ‌ణి. సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తూనే బుల్లి తెర‌పై ప్రోగ్రామ్స్‌లో జ‌డ్జ్‌గా ఆక‌ట్టుకుంటోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన క‌స్ట‌డీ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది ప్రియ‌మ‌ణి. ఈ సినిమా మే 12న రిలీజ్ కానుంది. మూవీ ప్ర‌మోష‌న్స్‌లో చాలా బిజీగా ఉంది. అందులో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ మెగా బాస్‌తో న‌టించాల‌నుందంటూ కోరిక‌ను వ్య‌క్తం చేసింది ప్రియ‌మ‌ణి.


‘‘తెలుగులో నేను బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్, ఎన్టీఆర్ వంటి వారితో క‌లిసి న‌టించాను. కానీ చిరంజీవిగారితో ఇప్ప‌టి వ‌ర‌కు సినిమానే చేయలేదు. అయ‌న‌తో సినిమా చేయాల‌నుంది. అలాగే బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం. చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోని స్పెష‌ల్ సాంగ్‌లో ఆయ‌నతో క‌లిసి న‌టించే అవ‌కాశం ద‌క్కింది. చైత‌న్య‌తో క‌లిసి క‌స్ట‌డీలో మంచి రోల్ చేశాను. త‌ను నాకు చాలా ఏళ్ల క్రిత‌మే తెలుసు. అయితే ఇప్పుడే క‌లిసి సినిమా చేస్తున్నాం’’ అన్నారు.

నాగ చైత‌న్య హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించిన చిత్రం క‌స్ట‌డీ. మ‌రో మూడు రోజుల్లో సినిమా ఆడియెన్స్ ముందుకు రానుంది. త‌మిళ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంతో తొలిసారి చైత‌న్య త‌మిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇళ‌య‌రాజా, యువన్ శంక‌ర్ రాజా ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అర‌వింద స్వామి ఇందులో విల‌న్‌గా న‌టించారు. శివ అనే కానిస్టేబుల్ పాత్ర‌లో నాగ చైత‌న్య క‌నిపించ‌బోతున్నారు. మ‌రి ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటో చూడాలి మ‌రి.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×