BigTV English

Vijay Devarakonda: కనిపించని దేవుడు.. మా రౌడీ హీరో.. వీడియో వైరల్

Vijay Devarakonda: కనిపించని దేవుడు.. మా రౌడీ హీరో.. వీడియో వైరల్

Vijay Devarakonda: దేవుడు ఎక్కడో లేడు.. ఎదుటి మనిషికి చేసే సాయంలోనే కనిపిస్తాడు. కానీ, ఇప్పుడు ఈ లోకమంతా స్వార్థపూరితమైంది. పక్కనవాడు ఎలా పోతే మాకేంటి అని పోయేవారు కొంతమంది అయితే.. పక్కవాడిని కొట్టి మరీ పైకి ఎదగాలి అనుకునేవారు మరికొంతమంది. ఇలాంటి సమాజంలో సాయం చేసేవాడు దొరకడమే కష్టం. ఇక అలాంటి సాయం చేసి కనిపించని దేవుడుగా మారాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.


పెళ్లి చూపులు సినిమాతో విజయ్ హీరోగా మారాడు. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ గా మారాడు. ఆ సినిమా తరువాత నుంచి అతడికి యాటిట్యూడ్ ఉందని, ఎలా పడితే ఆలా మాట్లాడతాడని, పొగరు అని, గౌరవం ఉండదని.. ఇలా రకరకాలుగా ట్రోల్ చేసినవారు ఉన్నారు. కానీ, విజయ్ లో ఇంకో యాంగిల్ ఉంది. అదే సహాయం చేసే గుణం. మొదటి నుంచి విజయ్ వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది. తన ప్రతి పుట్టినరోజుకు.. అభిమానులు ఏది అడిగితే అది ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు.

ఇక ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు అందరికన్నా ముందు ఉండి.. ప్రభుత్వాలకు తనకు తోచిన సాయం చేసి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక కరోనా సమయంలో అందరికి కనిపించిన దేవుడు సోనూసూద్ కాగా.. కనిపించని దేవుడిగా విజయ్ మారాడు. ఆ సమయంలో విజయ్ దేవరకొండ ఫౌండేషన్ పేరుతో చాలామందికి రేషన్ అందించి.. మంచి మనసును చాటుకున్నాడు. ముఖ్యంగా ట్రాన్స్ జెండర్స్ ఈ రేషన్ తినే బతికారు. ఈ విషయాన్నీ ఒక ట్రాన్స్ జెండర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.


” డబ్బులు అడిగి తినడమే మా బతుకు. కరోనా సమయంలో తినడానికి కూడా ఏం లేదు. ఆ సమయంలో ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని గూగుల్ సెర్చ్ చేస్తే విజయ్ దేవరకొండ ఫౌండేషన్ కనిపించింది. దాన్ని క్లిక్ చేసి అందులో నా డిటైల్స్ నింపగానే 16 నిమిషాల్లో కాల్ వచ్చింది. వారు ఇచ్చిన రేషన్ వలనే నేను బతికి ఉన్నాను. నేనే కాదు నాలాంటివారందరూ ఆ రేషన్ తినే కరోనా సమయంలో బతికాం. విజయ్ దేవరకొండ చేసిన పనికి నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. రెండేళ్లుగా ఆయనను కలిసి థాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను” అని తెలిపింది.

ఇక తాజాగా ఆమె.. ఇండియన్ ఐడల్ షోకు వచ్చి విజయ్ ను కలిసింది. ” కరోనా సమయంలో ఒక్క నాకే కాదు నాలాంటి 18 మంది ట్రాన్స్‌ జెండర్స్‌ వరకు మీరు సాయం చేశారు. నా కుటుంబానికి కూడా ఎంతో సాయం చేశారు. అప్పుడు నాకు నిజంగా అనిపించింది.. కనిపించని దేవుడు ఎక్కడో లేడు. మీలోనే ఉన్నారు అనిపించింది” అంటూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ అభిమానులు.. కనిపించని దేవుడు.. మా రౌడీ హీరో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Tags

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×