BigTV English

Marco : వయోలెన్స్ మూవీ మార్కో ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్… ఇక ఆ మూవీని చూడలేం…

Marco : వయోలెన్స్ మూవీ మార్కో ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్… ఇక ఆ మూవీని చూడలేం…

Marco : మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటించిన లేటెస్ట్ మూవీ మార్కో.. పూర్తి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో పాటుగా మలయాళ ఇండస్ట్రీలో 100 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమా రికార్డులలో మార్కో మూవీ నిలిచింది. భారీ యాక్షన్స్ సన్నివేశాలతో వణుకు పుట్టించేలా ఈ సినిమా ఉండటంతో సినిమా విజయాన్ని అందుకుందని తెలిసిందే. హనీఫ్ అదేనీ దర్శకత్వం వహించిన ఈ మూవీ మోస్ట్ వైలెంట్ చిత్రంగా పాపులర్ అయి కలెక్షన్లలోనూ దుమ్మురేపింది.. తాజాగా ఈ మూవీకి బిగ్ షాక్.. వయోలెన్స్ ఎక్కువగా ఉందని బ్యాన్ చెయ్యాలంటూ ఫిర్యాదులు వచ్చాయని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అసలు మ్యాటరేంటో తెలుసుకుందాం..


మార్కో ను తొలగించాలని డిమాండ్.. 

ఈ మూవీలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి.. అత్యంత క్రూరంగా పగ తీర్చుకోవం వంటి అంశాలు భయంకరంగా ఉన్నాయి. ఇలాంటి చిత్రాలు జనాలను తప్పు ద్రోవ పట్టిస్తున్నాయని ఒకవైపు వినిపిస్తున్నా కూడా మేకర్స్ పట్టించుకోకుండా ఇలాంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీకి చుక్కెదురైంది. విపరీతమైన హింస కారణంగా మార్కో ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు ఈ చిత్రాన్ని టెలివిజన్ ప్రదర్శన నుండి నిషేధించింది. ఉపగ్రహ ధృవీకరణ కోసం దాని దరఖాస్తు తిరస్కరించబడింది. అదే విధంగా OTT ప్లాట్‌ఫారమ్‌ల నుండి కూడా కంటెంట్‌ను నిషేధించాలని CBFC ప్రధాన కార్యాలయానికి ఒక ఫిర్యాదు అందింది . ఇక ఈ మూవీని చూసే అవకాశం లేనట్లే అని తెలుస్తుంది.


Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యకండి…

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

మార్కో మూవీని పక్కా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు దర్శకుడు హనీఫ్ అదేనీ. తన సోదరుడిని హత్య చేసిన వారిపై మార్కో పీటర్ రివేంజ్ తీర్చుకోవడం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. తీవ్రమైన హింసాత్మక యాక్షన్ సీన్లతో ఈ చిత్రం రూపొందింది. అందుకే మోస్ట్ వైలెంట్ మూవీ అనే ట్యాగ్ దక్కించుకుంది. ఈ చిత్రంలో కబీర్ దుహాన్ సింగ్ విలన్‍గా నటించారు.. ఎంతో ప్రేమించే సోదరుడు విక్టర్ ను చంపిన వారిపై మార్కో పగ తీర్చుకునే తీరు హై ఎండ్ యాక్షన్ సీక్వెన్సులతో ఇంప్రెస్ చేసింది. ఇకపోతే ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్ తో పాటు సిద్ధిక్, జగదీష్, అభిమన్యు ఎస్ తిలకన్, కబీర్ దుహాన్ సింగ్, అన్సన్ పాల్, యుక్తి తరేజా కీలక పాత్రల్లో నటించారు..

Also Read :

గతంలో ఇలాంటి వయోలెన్స్ చిత్రాలకు ఇలాంటి ఎదురు దెబ్బలు తగిలాయి. సినిమాపై ఎన్నో విమర్శలు రావడంతో గతకొన్నేళ్లుగా ఇలాంటి సినిమా కథలు కనిపించలేదు. మార్కో మూవీలో ఆ క్రూరమైన సన్నివేశాలను చూసారు. ఈ మూవీ బ్యాన్ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరి మార్కో చిత్రయూనిట్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×