Ram Gopal Varma.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)కు గుంటూరు సీఐడీ నోటీసులు జారీ చేసింది. “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” సినిమాలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వున్నాయి అని.. ఈ సినిమాను చిత్రీకరించిన వర్మపై గతంలోనే ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సీఐడీకి ఫిర్యాదులు అందాయి.ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విచారణకు రావాలి అని గుంటూరు సీఐడీ అధికారులు రామ్ గోపాల్ వర్మ కు నోటీసులు పంపించారు .అయితే ఇప్పుడు సీఐడీ నోటీసులను సవాల్ చేస్తూ వర్మ హైకోర్టును ఆశ్రయించారు.. గత కొన్ని రోజులుగా వర్మ పై పలు ప్రాంతాలలో ఫిర్యాదులు నమోదు అవుతున్న నేపథ్యంలో ఆయనకు వరుసగా నోటీసులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు రాంగోపాల్ వర్మ. మరి అక్కడ ఆయనకు ఎలాంటి ఊరట లభిస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వర్మను టార్గెట్ చేశారు అంటూ పలువురు నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
Chhaava: తెలుగు డబ్బింగ్.. ఆ ఒక్క మైనస్ భరించాల్సిందేనా..?
గతంలో కూడా వర్మకు నోటీసులు..
ఇదిలా ఉండగా గతంలో కూడా వర్మకు నోటీసులు అందాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కూడా జూబ్లీహిల్స్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్లి ఆయనకు నోటీసులు ఇచ్చి, విచారణకు రావాలని పిలవచారు. సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan), మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) లను కించపరిచే విధంగా రాంగోపాల్ వర్మ పోస్ట్లు పెట్టాడని మద్దిపాడు స్టేషన్ లో కేసు నమోదయింది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్ట్ చేశాడని, టిడిపి మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై ఫిర్యాదు చేయగా.. ఆ క్రమంలో కూడా ఆయనకు నోటీసులు అందించారు.
రామ్ గోపాల్ వర్మ కెరియర్..
1962 ఏప్రిల్ 7న హైదరాబాదులో జన్మించిన రామ్ గోపాల్ వర్మ.. దర్శకుడిగా, స్క్రీన్ రైటర్ గా, నిర్మాతగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ప్రధానంగా తెలుగు, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా వాస్తవికతను దృష్టిలో పెట్టుకొని. సాంకేతిక నైపుణ్యంలో చిత్రాలను అద్భుతంగా తీర్చిదిద్దడంలో దిట్టగా పేరు సొంతం చేసుకున్నారు వర్మ. ముఖ్యంగా ప్రయోగాత్మక చిత్రాలకు వర్మ పెట్టింది పేరు. రాయలసీమలో రాజకీయ పార్టీలను దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తూ మరింత పాపులారిటీ అందుకున్నారు. రక్త చరిత్ర, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు వంటి చిత్రాలు రాజకీయ వాస్తవికతకు అద్దం పడుతున్నాయనటంలో సందేహం లేదని అటు నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు.
రామ్ గోపాల్ వర్మకు గుర్తింపు అందించిన చిత్రాలు..
తెలుగులో రాంగోపాల్ వర్మ చిత్రాలు అనగానే ముందుగా క్షణక్షణం, శివ, గోవిందా గోవిందా వంటి చిత్రాలు ఈయనకు మంచి గుర్తింపును అందించాయి. 1989లో ‘శివ’ అనే సినిమాతో క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఈ సినిమా.. అప్పట్లో సంచలన విజయం అందుకుంది. ఈ సినిమాతో ఉత్తమ దర్శకుడిగా రాష్ట్ర నంది అవార్డును అందుకున్నారు. అంతేకాదు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు. ఇక తర్వాత వచ్చిన క్షణక్షణం సినిమా కూడా మంచి విజయాన్ని అందించింది.