BigTV English

Rana Naidu 2: వెంకటేష్.. ఈసారి ట్రోల్స్ నుంచి తప్పించుకుంటాడా.. ?

Rana Naidu 2: వెంకటేష్.. ఈసారి ట్రోల్స్  నుంచి  తప్పించుకుంటాడా.. ?

Rana Naidu 2: విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఒక్కో హీరోకి ఒక్కో అభిమాన సంఘం ఉంటుంది. ఆ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు వారు మాత్రమే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటారు. కానీ, వెంకటేష్ సినిమా రిలీజ్ అయ్యింది అంటే అందరి హీరోల అభిమానులు ఏకమవుతారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలకు పోనీ ఏకైక హీరో వెంకటేష్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకే వెంకీ మామ సినిమా వచ్చిందంటే అందరి ఫాన్స్ ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు.


 

మొదటినుంచి మంచి మంచి కథలను ఎంచుకొని ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరే విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకొని, ఇండస్ట్రీలో ఇప్పటికీ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు వెంకటేష్. అయితే జనరేషన్ మారే కొద్ది తాను కూడా మారాలి అనుకున్నాడో ఏమో తెలియదు కానీ, తన కెరీర్లో మొట్టమొదటిసారి వెంకీ మామ నెట్ ఫ్లిక్స్ తో జతకట్టి రానా నాయుడు అనే సిరీస్ లో నటించాడు. నిజం చెప్పాలంటే ఇదే వెంకీ మామ కెరీర్ లో చేసిన అతిపెద్ద తప్పు అని అనొచ్చు.


 

ఫ్యామిలీ మ్యాన్ గా ఇండస్ట్రీలో, బయట ఎంతో పేరు ఉన్న హీరో.. సడన్ గా బూతులు మాట్లాడుతూ, వల్గారిటీ ఉన్న సీన్స్ లో నటించేసరికి అభిమానులు దానిని తీసుకోలేకపోయారు. వెంకీకి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ మొత్తం రానా నాయుడు సిరీస్ తో పోయింది. ఇక మధ్యలో గ్యాప్ తీసుకున్న వెంకీ ఎలాగైనా తన ఇమేజ్ ను  మళ్ళీ తిరిగి దక్కించుకోవాలని సంక్రాంతి వస్తున్నాం అంటూ ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుని వెంకీ కెరీర్ లోనే మొట్టమొదటిసారి 100 కోట్ల క్లబ్ లో చేరేలా చేసింది.

 

ఇక దీని తర్వాత వరుస సినిమాలను లైన్లో పెట్టిన వెంకీ మరోసారి రానా నాయుడు సీజన్ 2 తో రాబోతున్నాడు. అయితే ఈసారి ఫ్యాన్స్ భయపడినట్లు ఏదీ లేదని తెలుస్తుంది. గతంలో ఆయనపై జరిగిన ట్రోలింగ్ ఏ రేంజ్ గా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అందుకే ఈసారి సీజన్ 2 కు వెంకీ మామ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది.  తాజాగా రానా నాయుడు తెలుగు ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎక్కడా కూడా బూతు పదాలను వాడకుండా జాగ్రత్తపడ్డారు.  అయితే సిరీస్ మొత్తంలో అసలు బూతులే ఉండవా లేక ట్రైలర్ మాత్రమే ఇలా కట్ చేశారా అనేది తెలియాల్సి ఉంది.

 

గత సీజన్లో రానా, వెంకీ మధ్య జరిగే సీన్స్ హైలెట్ గా  నిలిచాయి. ఇప్పుడు సీజన్ 1 కు మించి సీజన్ 2 ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తుంది.  ఫ్యామిలీ కోసం నాగ నాయుడు ఏం చేశాడు..? తన కొడుకు రానా నాయుడును ఎలా కాపాడుకున్నాడు..? అనేది సీజన్ 2 లో చూపించనున్నారు.  మొత్తానికి సీజన్ 2 చూసాక వెంకీ పై ట్రోల్స్ తగ్గుతాయని చెప్పొచ్చు.  జూన్ 13 నుంచి ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో  స్ట్రీమింగ్ కానుంది.  మరి ఈసారి వెంకటేష్ ట్రోల్స్ నుంచి  తప్పించుకుంటాడా.. ? లేదా అనేది చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×