BigTV English

Trump Musk Epstein Files: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌.. ట్రంప్ రాసలీలల కేసు గురించి బయపెట్టిన మస్క్

Trump Musk Epstein Files: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌.. ట్రంప్ రాసలీలల కేసు గురించి బయపెట్టిన మస్క్

Trump Musk Epstein Files| అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రముఖ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మస్క్‌ తాజాగా సంచలన ఆరోపణలు చేశాడు. ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించి, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా నియమించాలని చెప్పాడు. అంతేకాదు, జెఫ్రీ ఎప్‌స్టీన్‌ రాసలీలల‌ కుంభకోణంతో ముడిపడిన ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ట్రంప్‌ పేరు ఉందని, అందుకే ఆ ఫైల్స్‌ బహిర్గతం కావడం లేదని ఆరోపించాడు.


ఈ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల పేర్లు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ బడా సెలెబ్రిటీలందరూ టీనేజ్ యువతులు, చిన్నపిల్లలపై లైంగిక దాడులు చేశారని ఆరోపణలున్నాయి. జెఫ్రీ ఎప్‌స్టీన్ ఈ కేసులో ఒక ఏజెంట్. ట్రంప్, ఇతర వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులకు యువతులు సరఫరా చేసేవాడు.

ఈ ఫైల్స్‌లో ఎప్‌స్టీన్‌ సంబంధాలు, ఫ్లైట్‌ లాగ్‌లు, ఆధారాలు ఉన్నాయి. 2019లో ఎప్‌స్టీన్‌ జైలులో అనుమానాస్పదంగా మరణించాడు. అధికారులు దీన్ని ఆత్మహత్య అన్నారు. కానీ, ఈ ఫైల్స్‌ బయటకు రాకపోవడంతో అమెరికాలో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఎప్‌స్టీన్ తో ట్రంప్ కు సంబంధాలున్నట్లు మస్క్ ఆరోపించాడు. ఆ ఫైల్స్ లో మొత్తం బండారం ఉందని తెలిపాడు. కానీ రాజకీయ ప్రభావంతో ఆ ఫైల్స్ లోని వివరాలు బహిర్గతం కావడం లేదని అన్నాడు.


మరోవైపు ఈ గొడవ టెస్లా కంపెనీపై భారీ ప్రభావం చూపింది. ఒక్క రోజులో టెస్లా షేర్లు 14 శాతం పడిపోయి, సంస్థ మార్కెట్‌ విలువ 152 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.13 లక్షల కోట్లు) తగ్గింది. దీంతో టెస్లా విలువ 1 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 916 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. ఇంత పెద్ద నష్టం టెస్లా చరిత్రలో ఇదే మొదటిసారి.

మస్క్‌ మరో వివాదాస్పద వ్యాఖ్యలో.. 2024 ఎన్నికల్లో తన మద్దతు లేకుండా ట్రంప్‌, రిపబ్లికన్‌ పార్టీ ఓడిపోయేవారని చెప్పాడు. ట్రంప్‌ దీన్ని ఖండించాడు. తనకు మస్క్‌ సహాయం అవసరం లేదని, పెన్సిల్వేనియాలో తాను సొంతంగా గెలిచేవాడినని అన్నాడు. మస్క్‌ వ్యాపారాలకు ప్రభుత్వ కాంట్రాక్టులు, రాయితీలు రద్దు చేస్తానని హెచ్చరించాడు. మస్క్‌ స్పందిస్తూ.. ట్రంప్‌ అబద్ధాలు చెబుతున్నాడని, తాను బెదిరింపులకు లొంగనని, అవసరమైతే స్పేస్‌ఎక్స్‌ ఒప్పందాలను ఆపేస్తానని అన్నాడు.

మస్క్‌ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలా అని అభిమానులను అడిగాడు. ట్రంప్‌ను తొలగించాలన్న ప్రశ్నకు “అవును” అని సమాధానం ఇచ్చాడు. ఇటు, ప్రభుత్వ వ్యయ నియంత్రణ – ట్యాక్స్ బిల్లును మస్క్‌ వ్యతిరేకించడంపై ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మస్క్‌ తన స్నేహితుడైనా, ఈ బిల్లును వ్యతిరేకించడం సరికాదని, తనను నిరాశపరిచాడని అన్నాడు. మస్క్‌ ఈ బిల్లు వివరాలు చూడలేదని, తన సహాయం లేకుండా ట్రంప్‌ గెలిచేవాడు కాదని పునరుద్ఘాటించాడు. ఈ వివాదం టెస్లా షేర్ల పతనానికి కారణమైంది.

అయితే ఈ కొత్త  బిల్లుతో అమెరికా ద్రవ్య లోటు భారీగా పెరిగిపోతుందని.. ఒకప్పుడు ఈ అంశంపైనే అమెరికా అప్పులు పెరిగిపోతాయని  వాదించిన ట్రంప్ ఇప్పుడు అదే బిల్లుని సమర్థించడంపై మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు ట్రంప్ గతంలో చేసిన ట్వీట్లను వరుసగా పోస్ట్ చేసి.. ట్రంప్ ఎంతగా మాట మారుస్తున్నాడో ఎత్తి చూపారు.

Related News

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

Big Stories

×