BigTV English

Aadhi Sai Kumar: కెరియర్ లో ఉన్నది ఒకటే హిట్ సినిమా, అదే మళ్లీ రీ రిలీజ్

Aadhi Sai Kumar: కెరియర్ లో ఉన్నది ఒకటే హిట్ సినిమా, అదే మళ్లీ రీ రిలీజ్

Aadhi Sai Kumar : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో ఆది సాయికుమార్  ఒకరు. నటుడిగా ప్రస్తానాన్ని మొదలుపెట్టి హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలు కూడా చేసి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు సాయికుమార్. ఆ తర్వాత సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ ‘ప్రేమ కావలి’ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించింది. ఈ సినిమాకి మంచి బజ్ రావడానికి కారణం అనూప్ రూబెన్స్ అందించడం మ్యూజిక్ అని చెప్పాలి. ఈ సినిమాలో ప్రతి పాట కూడా మంచి హిట్ అయింది. కొన్ని రోజులు పాటు ఎక్కడపడితే అక్కడ ఈ పాటలు మారు మోగిపోయేవి. ఈ సినిమాకి విజయభాస్కర్ దర్శకత్వం వహించారు.


దర్శకుడు విజయభాస్కర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మల్లీశ్వరి, మన్మధుడు, నువ్వు నాకు నచ్చావ్, స్వయంవరం, చిరునవ్వుతో వంటి ఎన్నో సినిమాలకు విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. ఒకప్పుడు విజయభాస్కర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తుంది అని అంటే ఏమీ ఆలోచించకుండా ఆడియన్స్ అంతా కూడా థియేటర్ కు వెళ్లిపోయేవాళ్ళు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అంత సక్సెస్ఫుల్ కాంబినేషన్ వీరిది. అటువంటి విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కావలి సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. నటుడిగా ఆది సాయికుమార్ కూడా మంచి మార్కులు సాధించుకున్నాడు. ఆది సరసన ఈ సినిమాలో ఈషా నటించింది. ఇకపోతే ప్రేమకావాలి సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక్క హిట్ సినిమా కూడా ఆది కెరియర్ లో పడలేదు.

ఆ తర్వాత ఆది వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు. అయితే ఏ సినిమా కూడా ఆదికి బ్రేక్ ఇవ్వలేదు. ఇప్పటికీ అది ఒక మంచి సినిమా చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. దీని కారణం నటుడుగా ఆల్రెడీ ఆది ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి. ఇకపోతే ఆది నటించిన మొదటి సినిమాని అక్టోబర్ 26వ తారీఖున రీ రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో రీ రిలీజ్ ట్రెండ్ ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా మొదలైన ఈ రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పటికీ సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా చాలా తమిళ సినిమాలు కూడా తెలుగు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ రిలీజ్ సినిమాలకు సంబంధించిన వీడియోస్ కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. ఎన్నో సినిమాలను ఆదరించిన తెలుగు సినిమా బానిసలు ఇప్పుడు ప్రేమ కావలి సినిమాను ఏ మేరకు ఆదరిస్తారు తెలియాలి అంటే అక్టోబర్ 26 వరకు వేచి చూడకు తప్పదు.


అయితే, ఈ ప్రేమ  కావాలి అనే మూవీ రీ రిలీజ్ అవుతుంది అంటే… ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుంది అనే ప్రశ్న కూడా రావొచ్చు. అయితే ఆది సాయి కుమార్ కెరీయిర్ లో హిట్ ఉందా అంటే అది కేవలం ప్రేమ కావాలి మాత్రమే. ఈ మూవీ రీ రిలీజ్ అయితే కలెక్షన్ల రికార్డులు వస్తాయో రావో తెలియదు కానీ, ఆది సాయి కుమార్ లోని నటుడిని మరోసారి ప్రేక్షకులు చూసే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×