E-Paper
Advertisement

Hyderabad Crime News: గచ్చిబౌలిలో దారుణం.. మహిళా టెక్కీపై ఇద్దరు అత్యాచారం, ఆపై..

Hyderabad Crime News: గచ్చిబౌలిలో దారుణం.. మహిళా టెక్కీపై ఇద్దరు అత్యాచారం, ఆపై..
Advertisement

Hyderabad Crime News: హైదరాబాద్‌లో దారుణం వెలుగుచూసింది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరుపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మసీద్ బండ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం..

రాత్రి వేళ మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు.. కామాంధులు రెచ్చిపోతున్నారు. లేటెస్ట్‌గా ఆటోలో రూమ్‌కి వెళ్తున్న టెక్కీపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆటోడ్రైవర్ తోపాటు మరో యువకుడి పై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

బాధిత యువతి హైదరాబాద్ గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. డ్యూటీ నిమిత్తం గత రాత్రి ఆర్సీపురం ప్రాంతంలో మహిళా టెక్కీ ఆటో ఎక్కింది. అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో ఆటోలో మసీద్ బండ ప్రాంతానికి చేరుకుంది. ఆ సమీపంలోకి రాగానే దారిలో ఆటోడ్రైవర్‌కి మరో వ్యక్తి జత కలిశాడు.

ఏం జరిగిందో తెలీదుగానీ, ఆటోలో తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని బాధితురాలు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన తర్వాత తనను మసీదు బండ ప్రాంతంలో వదిలి వెళ్లి పోయారని అందులో ప్రస్తావించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు.

Advertisement

ALSO READ: ప్రియుడి కోసం లాడ్జికి వెళ్లిన యువతి.. పోలీసుల ఎదురుగానే హత్య!

వెంటనే ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు పోలీసులు. చుట్టుపక్కల సీసీ కెమెరాలపై దృష్టి సారించారు. సమీపంలో ఉన్న ఫుటేజ్‌ని చెక్ చేస్తున్నారు. బాధిత మహిళ ఆటో ఎక్కిన ప్రాంతంలో సీసీకెమెరాలను పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×