BigTV English

Sandeep Reddy Vanga With RGV : రెండు సినిమా పిచ్చి ఉన్న జంతువులు, అనిమల్ పార్కులో కలిసాయి

Sandeep Reddy Vanga With RGV : రెండు సినిమా పిచ్చి ఉన్న జంతువులు, అనిమల్ పార్కులో కలిసాయి

Sandeep Reddy Vanga With RGV : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. దానిలో సందేహం లేదు. కానీ సినిమా దిశా దశ మార్చే సినిమాలు అతి తక్కువగా వస్తుంటాయి. అటువంటి సినిమాల ప్రస్తావన వస్తే మొదటిగా మాట్లాడవలసింది రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమా. అప్పటివరకు ఒక మూసలో వెళుతున్న తెలుగు సినిమాలను పరుగులు పెట్టించాడు రామ్ గోపాల్ వర్మ. తాను విజయవాడలో చదువుకుంటున్నప్పుడు చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ను అలానే తాను చూసిన కొన్ని ఇంగ్లీష్ సినిమాలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని శివ కథను రెడీ చేసి తెలుగు ప్రేక్షకులకు సర్ప్రైజింగ్ ఎక్స్పీరియన్స్ ను అందించాడు. శివ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. శివ సినిమా చూసిన తర్వాత చాలామంది దర్శకులు కావాలనుకున్న వాళ్ళు అప్పటికే రాసుకున్న కథలను కూడా చింపేసారు.


శివ సినిమా తర్వాత ఆ స్థాయిలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇంపాక్ట్ చూపించిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగ దర్శకుడుగా పరిచయమయ్యాడు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ రేంజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను దర్శకత్వం వహించిన మూడవ సినిమాతోనే దాదాపు 1000 కోట్లకు పైగా వసూళ్లు వచ్చే స్టామినా ఉన్న డైరెక్టర్ అని నిరూపించుకున్నాడు. బాలీవుడ్ లో ఒక తెలుగు వాడి సత్తా ఏంటో రాంగోపాల్ వర్మ తర్వాత చూపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఇక రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ ఒక అవార్డు తీసుకున్నప్పుడు కూడా ఎడిటింగ్ నేను రాంగోపాల్ వర్మ సినిమాలను చూసి నేర్చుకున్నాను అని చెప్పారు. దీనిపై రాంగోపాల్ వర్మ కూడా స్పందించారు.

మొదటి అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయినప్పుడు రాంగోపాల్ వర్మ సందీప్ ని ఏ రేంజ్ లో పొగిడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. మరోసారి వీరిద్దరూ ఆర్జీవి ప్లేస్ లో కలిసారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోను రాంగోపాల్ వర్మ షేర్ చేస్తూ… “ఎన్ అనిమల్ షోయింగ్ ఎన్ అనిమల్ టు అనదర్ అనిమల్ ఇన్ ది అనిమల్ పార్క్ ఆఫ్ ఆర్జీవి డన్” అని డిఫరెంట్ గా పోస్ట్ రాసి ఫోటో షేర్ చేశారు రాంగోపాల్ వర్మ.


కాగా, ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ వరుస సినిమాలు చేయడానికి రెడీ అవుతన్నాడు. ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ చేయడానికి రెడీ గా ఉన్నాడు. ఇప్పటికే కథ, కథనం కూడా రెడీ అయ్యాయి. ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అతి త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కావొచ్చు.అలాగే, అనిమాల్ మూవీకి సీక్వెల్ గా అనిమాల్ పార్క్ కూడా రెడీగా ఉంది.

Related News

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Shriya Saran: నేను హీరోయిన్ అని నా భర్తకు తెలీదు.. ఆ మూవీ చూసి భయపడ్డారు – శ్రియా

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Big Stories

×