Tollywood Heros: సినిమాల్లో హీరోల క్యారక్టర్లు చాలా ముఖ్యమైనవి.. స్టోరీ వీళ్ల చుట్టు తిరిగే స్టోరీతోనే మూవీ మొత్తం ఉంటుంది. అయితే ఇప్పటివరకు కొన్ని సినిమాల్లో హీరో చుట్టు సినిమా సాగుతుంది. సినిమా క్లైమాక్స్ లో హీరో, విలన్ మధ్య గొడవలు జరిగి భీకర ఫైట్ చేస్తాడు. విలన్ ను ఎలాగైన చంపేసి స్టోరికి ఎండ్ చెప్పేస్తాడు. అలా సినిమాకు హీరో శుభం కార్డు వేస్తాడు. అయితే మాములుగా ఏ సినిమాలో అయినా సరే చివరిలో హీరో చనిపోతే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపరు. కానీ మరికొన్ని సినిమాలలో హీరోలు ఎండింగ్లో చనిపోతే ఆ సినిమాకు ప్రేక్షకులు పగ్గం కడతారని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటివరకు చనిపోని క్యారక్టర్ లో నటించని హీరోలు ఎవరో ఒకసారి వివరంగా తెలుసుకుందాం…
మహేష్ బాబు..
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కో సినిమాతో స్టార్ హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు మహేష్ బాబు ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే ఇప్పటివరకు హిట్ సినిమాల్లో చనిపోలేదు. ఈయన 25 వ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తున్నాడు.. గత ఏడాది గుంటూరు కారం మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు రాజమౌళి మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..
పవన్ కళ్యాణ్..
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మెగా స్టార్ బ్రదర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా ఒక్కో సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు.. ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో ఇప్పటివరకు ఏ సినిమాలోనూ చనిపోయిన క్యారక్టర్ లో నటించలేదు. అందుకే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయ్యాడు..
విజయ్ దేవరకొండ..
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించాడు. ఆయన నటించిన సినిమాల్లో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా.. మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే ఇప్పటివరకు విజయ్ దేవరకొండ నటించిన సినిమాల్లో చనిపోయిన క్యారెక్టర్ లో నటించలేదు. ప్రతి సినిమాలను చివరి వరకు స్క్రీన్ మీద కనిపించాడు. ప్రస్తుతమైన వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు..
వీళ్లే కాదు ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోలు చేసిన సినిమాల్లో చనిపోయే క్యారెక్టర్లలో నటించలేదు. అయితే చనిపోయిన క్యారెక్టర్ లో నటించిన హీరోలు కూడా కొందరు ఉన్నారు. ఇప్పటికీ వరుస సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.. కొందరు హీరోలు సినిమాల్లో చనిపోవడంతో స్టోరీ డల్ అయ్యింది. దాంతో మూవీ యావరేజ్ టాక్ ను అందుకుంది. ఈ మధ్య హీరోల ఫుల్ లెంత్ సినిమాలు వస్తున్నాయి. విషయమేంటంటే.. స్టార్ హీరోల భారీ బడ్జెట్ చిత్రాల కంటే చిన్న సినిమాలే ఘన విజయాన్ని సాధిస్తున్నాయి. అందుకే ఆడియన్స్ అలాంటి సినిమాలకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..